టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు శుక్రవారం నాడు పోలీసులు తరలించారు. నిన్న రాత్రి ఆయనను మచిలీపట్టణం సబ్ జైలులో ఉంచారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గుంటూరు: ఏపీ సీఎం Ys Jagan పై బూతు వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి Pattabhiని శుక్రవారం నాడు rajahmundry Cnetral జైలుకు తరలించారు పోలీసులు.ఈ నెల 21న పట్టాభిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.దీంతో నవంబర్ 2వ తేదీ వరకు పట్టాభికి Remand విధించింది కోర్టు. నిన్న సాయంత్రం ఆయనను మచిలీపట్టణం సబ్ జైలుకు పంపారు. రాత్రిపూట ఆయన అక్కడే ఉన్నారు.ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని మచిలీపట్టణం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
also read:శాంతి భద్రతలకు విఘాతం: పట్టాభి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
undefined
ఏపీ సీఎం జగన్ పై బూతు వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపర్చారు. కోర్టుకు సమర్పించిన పట్టాభి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.ఇదిలా ఉంటే పట్టాభిని కస్టడీలోకి తీసుకోవాలని విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మరో వైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేయనుంది కోర్టు.
జగన్ పై Tdpనేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీలో Ycp శ్రేణులు ఇవాళ కూడా జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీడీపీ చీఫ్ చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడులను నిరసిస్తూ చంద్రబాబు టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల దీక్ష కొనసాగుతుంది. ఇవాళ రాత్రి 8 గంటలతో ఈ దీక్ష ముగియనుంది.