టిడిపి కార్యాలయంలో పగిలిన ప్రతి అద్దం... వైసిపి పతనానికి నాంది: టిడిపి ఎమ్మెల్యే సాంబశివరావు

Arun Kumar P   | Asianet News
Published : Oct 22, 2021, 10:42 AM IST
టిడిపి కార్యాలయంలో పగిలిన ప్రతి అద్దం... వైసిపి పతనానికి నాంది: టిడిపి ఎమ్మెల్యే సాంబశివరావు

సారాంశం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షలో పాల్గొన్న నాయకులు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ఈ దాడితో 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తల గుండె రగిలిపోతోందన్నారు. కేవలం నలుగురు ఆకురౌడీలు వచ్చి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే భయపడేవారెవరూ లేరన్నారు సాంబశివరావు. 

మంగళగిరిలి TDP Head Office పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత chandrababu naidu 36గంటల దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న  ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ...     టీడీపీ ఆఫీసులో పగిలిన ఒక్కో అద్దం వైసీపీ పతనానికి నాంది అన్నారు.

''అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీకి రాష్ర్ట ప్రయోజనాలే ముఖ్యం. వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ది శూన్యం. చంద్రబాబు కష్టం, సిస్టం తెలిసన వ్యక్తి. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యం'' అని eluru sambashivarao అన్నారు. 

''వైసీపీ ఎమ్మెల్యేలకు ys jagan పై అసంత్పప్తి, ycp mla లపై వాళ్ల కార్యకర్తలకు అసంతృప్తి, వైసీపీ పాలనపై ప్రజలకు అసంతృప్తి వుంది. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి'' అన్నారు ఎమ్మెల్యే సాంబశివరావు.

PHOTOS  ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు దీక్ష... టిడిపి కార్యాలయంలోనే నిద్రించిన చంద్రబాబు (ఫోటోలు)

ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ మాట్లాడుతూ... జగన్ రెడ్డి మెంటల్ రోగి అయితే ఆయన అభిమానులు బీపీ రోగులని ఎద్దేవా చేసారు. వీళ్లతో రాస్ట్రానికి రోగం చుట్టుకుందని... ఈ రోగాలన్నింటికి టీడీపీ  వైద్యం చేస్తుందన్నారు. 

''రాణి రుద్రమదేవి రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహగర్జనలు నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వినిపించాలి. టీడీపీ శ్రేణులు మీ శక్తిని ప్రదర్శించండి... తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురండి'' అని anand sagar పిలుపునిచ్చారు. 

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ... చంద్రబాబు చేపట్టినఈ దీక్షను చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అప్రజాస్వామిక విధానాలను వీడాలన్నారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారంతో రాష్ట్ర యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దాలన్నందే చంద్రబాబు లక్ష్యమన్నారు. 

''టీడీపీ ఒక మహావృక్షం... ఆ వృక్షాన్ని కూల్చాలని వైసీపీ ప్రజాస్వామ్యం విలువలకు పాతరేసి ప్యాక్షన్ దోరణి ప్రదర్శిస్తోంది. సమాజంలో శాంతి నెలకొల్పేందుకు, 5 కోట్ల మందికి రక్షణ కల్పించేందుకు చంద్రబాబు దీక్ష చేస్తున్నారు'' అని gollapalli suryarao అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్