డాక్టర్ శిల్ప సూసైడ్: షాకింగ్ విషయాలను బయటపెట్టిన పేరేంట్స్

By narsimha lodeFirst Published Aug 10, 2018, 4:38 PM IST
Highlights

డాక్టర్ శిల్ప ఆత్మహత్య  చేసుకోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లపై చర్యలు తీసుకొంటే ఇంతకాలంపాటు శిల్ప చేసిన పోరాటానికి  న్యాయం జరుగుతోందని  కుటుంబసభ్యులు  భావిస్తున్నారు.

తిరుపతి: డాక్టర్ శిల్ప ఆత్మహత్య  చేసుకోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లపై చర్యలు తీసుకొంటే ఇంతకాలంపాటు శిల్ప చేసిన పోరాటానికి  న్యాయం జరుగుతోందని  కుటుంబసభ్యులు  భావిస్తున్నారు.  లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాటం చేసిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొంటుందని భావించలేదని  కుటుంబసభ్యులు చెప్పారు.

డాక్టర్ శిల్ప కుటుంబసభ్యులు  ఓ తెలుగున్యూస్ ఛానెల్ తో  మాట్లాడారు.  డాక్టర్ శిల్ప కాలేజీలో పడిన ఇబ్బందులను తమతో షేర్ చేసుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. 

డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొంటుందనే విషయం తమకు తెలియదన్నారు.ఏనాడూ కూడ తమకు  ఈ విషయమై అనుమానం రాలేదని డాక్టర్ శిల్ప తల్లిదండ్రులు , సోదరి చెప్పారు.  చనిపోవడానికి నాలుగు గంటల ముందు తాను మాట్లాడినట్టు  డాక్టర్ శిల్ప తండ్రి  చెప్పారు. పీజీ పరీక్షల ఫలితాలు వచ్చినట్టు ఆ సమయంలో శిల్ప తనకు చెప్పలేదన్నారు.

తన కూతురు కోసం తాను బ్యాంకు ఉద్యోగం కూడ మానేయాలని భావించానని ఆమె తండ్రి చెప్పారు. అయితే  కొన్ని రోజుల తర్వాత  ఉద్యోగం మానేసే  విషయమై  తనకు సమాచారం  ఇవ్వాలని  కోరారు. ఈ ఏడాది జనవరిలోనే తాను రాజీనామా చేయాలని భావించానని చెప్పారు.  అయితే ఇప్పుడే ఉద్యోగం మానేయకూడదని  తన కూతురు చెప్పిందన్నారు. ఆమె సూచన మేరకే తాను ఉద్యోగం కొనసాగిస్తున్నట్టు ఆమె తండ్రి చెప్పారు.

ఇదిలా ఉంటే  తన కూతురిని  పీడియాట్రిక్ విభాగం హెచ్‌ఓడీ  తన కూతురిని చాలా ఇబ్బందులకు గురిచేశారని డాక్టర్ శిల్ప  తల్లి చెప్పారు. టీ కప్పు విసిరేయడం, బుక్స్ విసిరేయడం, తప్పుడుగా మాట్లాడడం,  తోటి విద్యార్థులను తనతో మాట్లాడకూదని వేధించేవారని చెప్పారు.అయితే ఆరు మాసాల పాటు ఓపిక పట్టాలని తాను సూచించినట్టు ఆమె తెలిపారు. 

మైగ్రేయిన్‌ కోసం డాక్టర్ శిల్ప  ట్రీట్ మెంట్ తీసుకొందని తల్లి చెప్పారు. డాక్టర్ రవికుమార్ బెదిరింపుల వల్లే కొందరు  తోటి విద్యార్థులు  డాక్టర్ శిల్ప ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడేవారని ఆమె తల్లి గుర్తు చేసుకొన్నారు.

మరోవైపు  తన సోదరి  ఇలా చేస్తోందని భావించలేదన్నారు. తన సోదరి చాలా ధైర్యవంతురాలని ఆమె గుర్తు చేసుకొన్నారు.  తన సోదరి దేని కోసం  పోరాటం చేసిందో  ఆ పోరాటానికి ఫలితం తెలియకుండానే  కనుమూసిందన్నారు.

లైంగిక వేధింపులపై ఎంతో ధైర్యంగా పోరాటం చేసిన తన సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో ఇంతకాలం చేసిన పోరాటం వృధాగా మారిందన్నారు. తమకు న్యాయం జరుగుతోందని భావిస్తున్నట్టు చెప్పారు. కాలేజీలో రాజకీయాల వల్లే తమ సోదరికి న్యాయం జరగలేదని భావిస్తున్నట్టు సోదరి చెప్పారు.

ఈ వార్తలు చదవండి:డాక్టర్ శిల్ప సూసైడ్: 'ఆ నివేదిక ఆలస్యానికి బాధ్యులపై చర్యలకు డిమాండ్'

డాక్టర్ శిల్ప సూసైడ్: అట్టుడుకుతున్న ఎస్వీ మెడికల్ కాలేజీ
డాక్టర్ శిల్ప సూసైడ్: సీఐడీ విచారణ షురూ, కొనసాగుతున్న ఆందోళన

డాక్టర్ శిల్ప ఆత్మహత్య: ఆ నివేదికలో ఏముంది?

డాక్టర్ శిల్ప సూసైడ్: డాక్టర్ రవికుమార్‌పై వేటు, మరో ఇద్దరిపై చర్యలకు డిమాండ్

డాక్టర్ శిల్ప సూసైడ్: ఆ నివేదిక ఏమైంది, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

డ్యూటీకి రావాలంటే భయంగా ఉంది: ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిల్ప

click me!