న్యూడ్ వీడియోలు పంపుతామని బెదిరింపులు: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య

By narsimha lode  |  First Published Sep 8, 2022, 9:31 AM IST

లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక రాజమండ్రిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో కూడా లోన్ యాప్ వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.
 


రాజమండ్రి: లోన్ యాప్  నిర్వాహకుల వేధింపులు భరించలేక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి దంపతులు రాజమండ్రిలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. దుర్గాప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రమ్యలక్ష్మి కుట్టుపని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  

తమ కుటుంబ అవసరాల నిమిత్తం దుర్గాప్రసాద్ దంపతులు లోన్ యాప్ ద్వారా ఇటీవల  రూ. 50వేలను అప్పుగా తీసుుకున్నారు. ఈ అప్పును సకాలంలో చెల్లించలేదు.  తీసుకున్న అప్పుతో పాటు వడ్డీ పెరిగింది.  దీంతో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి.  లోన్ డబ్బులు చెల్లించకపోతే మీ నగ్న వీడియోలను అందరికి పంపుతామని లోన్ యాప్ నిర్వాహకులు రమ్యలక్ష్మిని బెదిరించారు.

Latest Videos

undefined

ఈ బెదిరింపుల విషయమై భర్త దుర్గా ప్రసాద్ కు భార్య చెప్పింది. లోన్ తీర్చే మార్గం లేకపోయింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. పిల్లలను ఇంటి వద్దే రాజమండ్రిలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగారు. తాము లాడ్జీలో పురుగుల మందు తాగిన విషయాన్ని దంపతులు బంధువులకు పోన్ చేసి చెప్పారు.  వెంటనే వారు  లాడ్జీకి వెళ్లి పురుగుల మందు తాగిన దంపతులను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మరణించారు.గతంలో కూడ లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

లోన్ యాప్ లో రూ. 6 వేలు అప్పు తీసుకుని సకాలంలో చెల్లించలేదని లోన్ యాప్ సంస్థ వేధింపులకు పాల్పడడంతో  కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన హైద్రాబాద్ జల్ పల్లిలో ఈ ఏడాది జూన్ 20న చోటు చేసుకుంది. అగ్నిమాపక విభాగంలో సుధాకర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం సుధాకర్ లోన్ యాప్ ద్వారా రూ.  6 వేలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు తీర్చనందుకు వేధింపులకు పాల్పడడంతో సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఉమ్మడి కృష్ణా జిల్లాలో  లోన్ యాప్ వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఏడాది జూలై 12న ఈ ఘటన చోటు చేసుకుంది. లోన్ యాప్ ల ద్వారా వివాహిత రూ. 20 వేలు అప్పులు తీసుకుంది. ఈ 20 వేలకు గాను ఆమె రూ. 2 లక్షలు చెల్లించింది. అయినా కూడా డబ్బులు చెల్లించాలని వేధింపులకు పాల్పడ్డారు. లేకపోతే నగ్నవీడియోలను బంధువులకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు.  ఈ బెదిరింపులు తట్టుకోలే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

also read:చైనీస్ లోన్ యాప్స్ కేసు: పేటి‌ఎం, రేజర్ పే, క్యాష్ ఫ్రీ స్థావరాలపై ఈ‌డి దాడులు, 17 కోట్లు స్వాధీనం..

లోన్ యాప్ వేధింపులు భరించలేక రాజమండ్రిలో సతీష్ అనే యువకుడు ఈ ఏడాది జూన్ 26న  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రైలు కింద పడి సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

click me!