టీఆర్ఎస్ నేతల ఏపీ టూర్లపై టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం

By narsimha lodeFirst Published Jan 17, 2019, 3:04 PM IST
Highlights

ఏపీ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  చేసిన రాజకయీ వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించే సమయంలో టీడీపీ నేతలు ఎవరూ కూడ పాల్గొనకూడదని బాబు ఆదేశించారు.
 

అమరావతి:ఏపీ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  చేసిన రాజకయీ వ్యాఖ్యలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించే సమయంలో టీడీపీ నేతలు ఎవరూ కూడ పాల్గొనకూడదని బాబు ఆదేశించారు.

 సంక్రాంతి పర్వదినం సందర్భంగా  టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  ఏపీ రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో  దుర్గమ్మను సందర్శించుకొన్న తర్వాత   మీడియాతో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

ఈ రాజకీయ వ్యాఖ్యలపై  దుర్గమ్మ పాలకమండలి కూడ ఆగ్రహాం వ్యక్తం చేసింది. గురువారం నాడు పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు టెలి కాన్పరెన్స్ నిర్వహించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్‌‌లో  తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలను బాబు ప్రస్తావించారు. ఆలయాల్లో దేవుడి మొక్కులను చెల్లించేందుకు వచ్చిన సమయంలో  రాజకీయాలు మాట్లాడడాన్ని బాబు తప్పుబట్టారు. దేవాలయాలకు వచ్చి రాజకీయాలు చేస్తారా అని బాబు ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతలు ఏపీ రాష్ట్రంలో పర్యటిస్తే టీడీపీ నేతలు ఎవరూ కూడ ఆ పర్యటనల్లో పాల్గొనకూడదని బాబు ఆదేశించారు. తలసాని పర్యటనలో కొందరు టీడీపీ నేతలు పాల్గొన్నారు. పార్టీ తరపున ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు కూడ తలసానిని కలిసినవారిలో ఉన్నారు.

టీఆర్ఎస్‌ నేతల పర్యటనలో టీడీపీ నేతలు కూడ పాల్గొనడం వల్ల రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని బాబు భావిస్తున్నందునే ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు.బంధుత్వాలు, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు.

తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుండి టీఆర్ఎస్ సర్కార్ తొలగించిన విషయాన్ని బాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీతో  వైసీపీ జట్టు కట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.తమకు బీసీలపై ప్రేమ ఉందంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

సంబంధిత వార్తలు

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని

 

click me!
Last Updated Jan 17, 2019, 3:04 PM IST
click me!