జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

By narsimha lodeFirst Published Jan 17, 2019, 2:32 PM IST
Highlights

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఏ గురువారం నాడు పూర్తి చేసింది. శుక్రవారం నాడు  ఎన్ఐఏ అధికారులు  శ్రీనివాసరావును కోర్టులో హాజరుపర్చనున్నారు.
 

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఏ గురువారం నాడు పూర్తి చేసింది. శుక్రవారం నాడు  ఎన్ఐఏ అధికారులు  శ్రీనివాసరావును కోర్టులో హాజరుపర్చనున్నారు.

గత ఏడాది అక్టోబర్ లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి  పాల్పడ్డాడు.ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. కోర్టు అనుమతితో ఎన్ఐఏ అధికారులు శ్రీనివాసరావును తమ కస్టడీకి తీసుకొన్నారు. హైద్రాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో శ్రీనివాసరావును విచారించారు.

శ్రీనివాసరావు లాయర్  సలీం సమక్షంలోనే ఈ విచారణ సాగింది. గురువారం నాడు మధ్యాహ్నానికి విచారణ ముగిసింది.ఈ వారం రోజుల పాటు శ్రీనివాసరావు విచారణకు సంబంధించి తెలుసుకొన్న విషయాలపై ఎన్ఐఏ అధికారులు సమగ్రంగా నివేదికను తయారు చేస్తున్నారు.రేపు ఉదయానికి శ్రీనివాసరావును విజయవాడకు తీసుకెళ్లనున్నారు. శ్రీనివాసరావును శుక్రవారం నాడు కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం

జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...

కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

click me!