పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

By narsimha lodeFirst Published Dec 21, 2018, 4:24 PM IST
Highlights

ఇవాళ్టి నుండి  ఎన్నికల వరకు పార్టీలో ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్టు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

అమరావతి:  ఇవాళ్టి నుండి  ఎన్నికల వరకు పార్టీలో ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్టు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు ప్రకటించారు. పార్టీ నేతల తీరుపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు  చెప్పినా కూడ కొందరు తమ ప్రవర్తనను మార్చుకోవడంపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు  అమరావతిలో  టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో  పార్టీని బలోపేతం చేసే విషయమై చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చర్చించారు. 

ఏపీలో కూడ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నేతలంతా ప్రజలతో  కలిసి ఉండాలని బాబు సూచించారు. ఇవాళ్టి నుండి ప్రతి ఒక్కరూ కూడ పార్టీ కార్యక్రమాల్లో ఉండాలని బాబు ఆదేశించారు. తనతో సహా పార్టీ శ్రేణులంతా  పార్టీ కోసం పనిచేయాలని ఆయన కోరారు.

ఎన్ని సార్లు చెప్పినా కూడ కొందరు నేతలు తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదని బాబు ఈ సమావేశంలో  ఆందోళన  వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు విషయమై బాబు కొందరు నేతలకు క్లాస్ తీసుకొన్నారు. సభ్యత్వ నమోదు విషయమై ఆయా జిల్లాల పరిస్థితి గురించి బాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు.

పశ్చిమగోదావరి జిల్లా సభ్యత్వ నమోదులో  మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని కర్నూల్, కృష్ణ జిల్లాలు నిలిచినట్టు బాబు చెప్పారు. అత్యధికంగా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో  అత్యధికంగా సభ్యత్వం నమోదైంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో  అతి తక్కువ సభ్యత్వం నమోదైనట్టుగా చంద్రబాబు చెప్పారు.

ఇవాళ్టి నుండి ఎన్నికల వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. జనవరిలో జన్మభూమి- మా ఊరు  కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో 8 శ్వేత పత్రాలను విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనే విషయాన్ని  శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రానికి ఏం చేయకుండానే ప్రధానమంత్రి జనవరి 6వ తేదీన ఏపీకి వస్తున్నారని బాబు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

 

click me!