సానుభూతి కోసమే చంద్రబాబు కదలడం లేదు: సుజనా చౌదరి ఫైర్

Published : Sep 25, 2019, 05:07 PM IST
సానుభూతి కోసమే చంద్రబాబు కదలడం లేదు: సుజనా చౌదరి ఫైర్

సారాంశం

చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూల్చివేశారని ప్రచారం జరిగితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎలాంటి గొడవలు, వివాదాలు ఉండవు  కదా అంటూ హితవు పలికారు. 

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం ఆరాటపడుతున్నారంటూ  సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఉండవల్లిలోని ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని కూల్చివేశారని ప్రచారం జరిగితే సానుభూతి వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. 

అద్దెకు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేస్తే ఎలాంటి గొడవలు, వివాదాలు ఉండవు  కదా అంటూ హితవు పలికారు. ఇకపోతే ఏపీలో కొన్ని న్యూస్ ఛానెల్స్ ప్రచారాన్ని నిలిపివేయడంపై కూడా చంద్రబాబు నాయుడును వదల్లేదు. 

గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీడియా సంస్థలను రాకుండా అడ్డుకున్నారని అప్పుడు ఆయన చేసిన తప్పు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ చేస్తున్నారంటూ సుజనా చౌదరి స్పష్టం చేశారు. మీడియాను నియంత్రించాలనుకోవడం సరికాదని హితవు పలికారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

కోడెల మృతికి ప్రభుత్వమే కారణం: బీజేపీ ఎంపీ సుజనా

మీకంత సీన్ లేదు, మీరు ఎమ్మెల్యే మాత్రమే: చంద్రబాబుపై సుజనాచౌదరి ఫైర్

అమరావతిపై జోక్యం చేసుకోవాలి: గవర్నర్ కు బీజేపీ వినతి

అమరావతిని గోస్ట్ సిటీలా మార్చేశారు, హోదా పెద్ద జోక్: జగన్ 100 రోజుల పాలనపై సుజనా చౌదరి సెటైర్లు

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

PREV
click me!

Recommended Stories

రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu
వేస్ట్ వస్తువులివ్వండి నిత్యావసర వస్తువులిస్తా: CM Chandrababu Super Speech | Asianet News Telugu