కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

Published : Sep 24, 2019, 05:40 PM IST
కోడెల ఆత్మహత్యపై నోటీసులు: 11 రోజుల గడువు అడిగిన ఫ్యామిలీ

సారాంశం

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసుకు సంబంధించి విచారణకు రావాలని బంజారాహిల్స్ పోలీసులు కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే  11 రోజుల తర్వాత విచారణఖు హాజరుకానున్నట్టుగా కోడెల  శివప్రసాద్ రావు కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన నివాసంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ కేసుకు సంబంధించి కుటుంబసభ్యులను విచారణ చేయాలని  హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.

ఈ విషయమై  కోడెల శివప్రసాద్ రావు కుటుంబసభ్యులకు పోలీసులు విచారణకు రావాలని కోరారు. అయితే  11 రోజుల తర్వాత విచారణకు హాజరు అవుతామని  కోడెల శిప్రసాద్ రావు కుటుంబసభ్యులు చెప్పారు.

ఆత్మహత్యకు ముందు కోెల శివప్రసాద్ రావు తన గన్‌మెన్‌కు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకొన్న రోజున కోడెల శివప్రసాద్ రావు ఎవరెవరికి ఫోన్ చేశాడనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు. 

మరో వైపు అంతకుముందు కూడ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కోడెల తిన్న టిఫిన్ తో పాటు ఇతర విషయాలపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకొన్న గదిని కూడ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు ఇంటికి ఎవరు వచ్చినా కూడ తమకు సమాచారం ఇవ్వాలని కూడ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

కోడెల శివప్రసాద్ రావు సెల్‌ఫోన్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్య చేసుకొన్న రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు కోడెల శివప్రసాద్ రావు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది.

కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసు విషయమై ఆయన మేనల్లుడు గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును  ఆ జిల్లా పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు.

కోడెల శిపవ్రసాద్ రావు కుటుంబసభ్యులను విచారించిన తర్వాత ఈ కేసు విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో ఉన్నారు బంజారాహిల్స్ పోలీసులు.


సంబంధిత వార్తలు

కోడెల ఆత్మహత్య కేసు: సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటీషన్ కొట్టివేత

కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

ఆత్మహత్య: చివరి ఫోన్ కోడెల ఎవరికి చేశారో తెలిసింది

కోడెల ఫోన్ ఎక్కడ..? జగన్ కి ఆ అవసరం లేదు... బొత్స కామెంట్స్

కోడెల అంత్యక్రియలు... ఆయన అభివృద్ధి చేసిన స్మశానంలోనే...

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on Chandrababu Super Six: సూపర్ సిక్స్ – సూపర్ ప్లాప్ | Asianet News Telugu
నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ | RK Roja Sensational Comments on Chandrababu | Asianet News Telugu