సీఎం, రాజప్ప రాజీనామా చెయ్యాలి, శివాజీని అరెస్ట్ చెయ్యాలి: మాణిక్యాల రావు డిమాండ్

By Nagaraju TFirst Published Oct 26, 2018, 7:18 PM IST
Highlights

వైఎస్సార్‌సీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం ఘటనపై సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరమని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని స్పష్టం చేశారు. 

కాకినాడ: వైఎస్సార్‌సీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పై హత్యాయత్నం ఘటనపై సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు బాధాకరమని మాజీమంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని అప్పుడే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని స్పష్టం చేశారు. 

జగన్‌పై దాడి ఆయన అభిమానే చేశాడని, చిన్న గాయమే అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు చేసే ప్రయత్నంలో భాగమేనంటూ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో సంచరించడానికి భయపడే పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో ప్రతిపక్షాలు బయట తిరగకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలనుకుంటున్నారని టీడీపై ధ్వజమెత్తారు.  

రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలను ఏపీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారని మాణిక్యాలరావు స్పష్టం చేశారు. గతంలో కూడా విశాఖ రన్‌వేపై రాష్ట్రానికి చెందిన పోలీసులే జగన్‌ను అడ్డుకోవడం చూశామని గుర్తు చేశారు. ఆపరేషన్‌ గరుడ అంటూ నటుడు శివాజీ చెప్పింది నిజమే అయితే ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ జగన్‌పై జరిగిన దాడిని అడ్డుకోలేకపోయిందని ప్రశ్నించారు.

ఆపరేషన్ గరుడ నిజమైతే దాడి మీ ఫెయిల్యూర్‌గా భావించి చంద్రబాబు, హోంమంత్రి చినరాజప్ప రాజీనామా చేసి ప్రభుత్వాన్ని శివాజీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా శివాజీని అదుపులోకి తీసుకుని ఆపరేషన్‌ గరుడ వెనక ఎవరు ఉన్నారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆపరేషన్‌ గరుడపై విచారణ జరిపితే దీని వెనకున్న పెద్దలకు, మీ ప్రభుత్వానికి నష్టమా అని చంద్రబాబును నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత

click me!