మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

Published : Jan 28, 2019, 07:28 PM IST
మీ తండ్రి ఆత్మక్షోభిస్తుంది, పార్టీ వీడొద్దు: కోట్లకు రఘువీరారెడ్డి హితవు

సారాంశం

కోట్ల పార్టీ వీడితే దివంగత సీఎం విజయభాస్కర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందన్నారు. ఇప్పటికైనా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రాంతీయ పార్టీలతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నెట్టుకురాలేడని సూచించారు.   

విజయవాడ: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడటం దురదృష్టకరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రఘువీరా ఘాటుగా స్పందించారు. 

కోట్ల పార్టీ వీడితే దివంగత సీఎం విజయభాస్కర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందన్నారు. ఇప్పటికైనా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రాంతీయ పార్టీలతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి నెట్టుకురాలేడని సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ కోట్ల కుటుంబానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న తరుణంలో ఆయన పార్టీ వీడటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాలనుకున్న నిర్ణయాన్ని కోట్ల కుటుంబం పునరాలోచించుకోవాలని రఘువీరారెడ్డి సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అలక: కోట్ల చేరికపై సమాచారం లేదన్నకేఈ

టీడీపీలోకి కోట్ల: ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కోట్ల షరతులకు జగన్ నో: వెనక కారణాలు ఇవే...

 కోట్ల ఎఫెక్ట్: బైరెడ్డికి కర్నూల్ కాంగ్రెస్ బాధ్యతలు?

కోట్ల ఎంట్రీతో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు షాక్

టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి: కేఈ ఫ్యామిలీకి చిక్కులే

చంద్రబాబుతో రాత్రి విందు: టీడీపీలోకి కోట్ల ప్యామిలీ

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu