బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

Published : Dec 22, 2018, 03:25 PM IST
బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

సారాంశం

  రేపటి నుండి ప్రతి ఒక్క అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.తొలి రోజున ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది.

హైదరాబాద్:  రేపటి నుండి ప్రతి ఒక్క అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.తొలి రోజున ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది.

జనవరి 6వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి మోడీ పర్యటించనున్నారు.ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకుగాను  మోడీ సభను బీజేపీ ఏర్పాటు చేసింది.
అయితే ఏపీకి అన్యాయం చేసిన మోడీ క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మోడీ రాష్ట్రానికి వస్తున్నారని  టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీకి కేంద్రం నుండి ఇప్పటి వరకు వచ్చిన నిధుల విషయమై  శ్వేత పత్రాలు విడుదల చేయాలని ఏపీ సర్కార్  నిర్ణయం తీసుకొంది.అయితే ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై ఏపీ సర్కార్  శ్వేత పత్రం విడుదల చేయనుంది. డిసెంబర్ 23వ తేదీన  ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు.

రోజుకో  అంశంపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని ఏపీ  సర్కార్ భావిస్తోంది.జన్మభూమి సభల్లో ఈ శ్వేతపత్రాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్  భావిస్తోంది.
అయితే ప్రతి అంశంపై మంత్రులు విడుదల చేయాలా.. సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేస్తే బాగుంటుందా అనే విషయమై పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.

సంబంధిత వార్తలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్