కూన రవిపై తప్పుడు కేసులు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: అచ్చెన్నాయుడు వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Aug 29, 2019, 1:14 PM IST
Highlights

కూన రవికుమార్ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 
 

శ్రీకాకుళం: మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ పై వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. కూన రవి ఎవరిని హత్య చేయలేదని స్పష్టం చేశారు. ఎందుకు అంతలా ఆయనను వేధిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కూన రవికుమార్ పై జరుగుతున్న కక్షసాధింపుపై న్యాయబద్దంగా తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. కూన రవికుమార్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

కూన రవికుమార్ కేసు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాజీమంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 

కూన రవికుమార్‌ ఇంటికి పోలీసులు వచ్చి ఎందుకు తనిఖీలు చేశారో చెప్పాలని నిలదీశారు. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. ఏ హోదా లేని వైసీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల కుర్చీల్లో ఎలా కూర్చుంటారంటూ నిలదీశారు. తప్పుడు  కేసులు పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కూన రవికుమార్‌కు టీడీపీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీకాకుళంలో టెన్షన్, అజ్ఞాతం వీడని కూన రవికుమార్: పోలీసుల వేట, రిమాండ్ కు అనుచరులు

తప్పుడు ఆరోపణలతో క్షోభకు గురిచేయొద్దు: కోడెల

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

click me!