సామూహిక ఆత్మహత్యలకు అనుమతివ్వండి: హైకోర్టుకు అమరావతి రైతుల లేఖ

By Arun Kumar PFirst Published Aug 4, 2020, 12:29 PM IST
Highlights

అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.

అమరావతి: రాజధాని విషయంలో అడ్డంకులు తొలగిపోవడంతో అమరావతి నుండి పరిపాలనా రాజధానిని వైజాగ్ కు తరలించేందుకు జగన్ సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అయితే ఆ తరలింపు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో హైకోర్ట్ న్యాయమూర్తులకు రాజధాని రైతులు లేఖ రాశారు. 

ఇప్పటికే తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వానికిచ్చి మోసపోయామని... కాబట్టి మేము అందరం చనిపోవలనుకుంటున్నాము లేఖలో పేర్కొన్నారు. తమ సామూహిక మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్ట్ ను కోరారు. 

హైకోర్టుకు అమరావతి రైతులు రాసిన లేఖ యధావిదిగా

Date: 01-08-2020,
                              
Amaravati Farmers.

To 
Honrable Chief Justice,

High court,

Amaravati,

Andhrapradesh.

         Sub:- ఆంధ్రప్రదేశ్ - రాజధాని రైతులు- సంబందించిన -విజ్ఞప్తి.

Respected Sir,  అయ్యా మేము ఆంద్రప్రదేశ్ రాజధాని కో‌సం ప్రభుత్వాన్ని నమ్మి మా బ్రతుకు తెరువైన వ్యవసాయాన్నికూడా  భావితరాల భవిష్యత్ కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన దానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మమ్ములను వారి మోసపూరితమైన విధానాలతో మానసికంగా చంపటమే కాకుండా ఇప్పుడు మేము భౌతికంగా కూడా బ్రతకటానికి వీలులేని పరిస్తితులు  కల్పించినందువలన ఆ మోసాన్ని మేము తట్టుకోలేక మేము స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటున్నాము. దయచేసి అనుమతి ఇవ్వాలని వేడుకుంటున్నాము.


 

click me!