టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అసాధారణ ప్రదర్శనతో లీడ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో సెంచరీ బాదుతూ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.