చెదరని జ్ఞాపకం, మధుర స్మృతుల కలబోత...ఫోటో

ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు, నిరంతర కృషి దాగివుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్యోద్దేశం. 

special story on international photography day

మనిషి జీవిన ప్రస్థానంలో ప్రతీ రోజు ఓ మధుర జ్ఞాపకం ఆ 24 గంటల్లో సరదాలు, సంతోషాలు.. వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవైతే.. మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి.

మరి కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. అలనాటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మాట, పదం కొన్నాళ్లకు మరచిపోతాం.. కానీ ఓ ఫోటోను చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంది.

అంతటి ప్రాముఖ్యత కలిగిన ఫోటోగ్రఫీకి కూడా ఓ రోజు వుందన్న సంగతి తెలుసా.. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ జే.ఎం డాగ్యూరే 1837లో ఫోటోగ్రఫీ పద్ధతిని కొనుగొన్నారు. అంతకు ముందు 1826లోనే ఫ్రాన్స్‌కే చెందిన జోసెఫ్ నైసిఫోరా నీప్సి ఫోటోగ్రఫీ చరిత్రలో తొలిసారిగా ఛాయాచిత్రాన్ని తయారు చేశారు.

ఇంటి వెనుక పెరట్లో 8 గంటల పాటు ఛాయాచిత్రాన్ని సిల్వర్ అణువులు వున్న ప్లేట్‌పై ఆయన బంధించారు. కానీ దానిని ఎక్కువ రోజులు కాపాడలేకపోవడంతో.. డాగ్యూరే రూపొందించిన విధానానికి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఆమోదముద్ర వేసింది.

రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫోటోగ్రఫీ. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫోటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడమని అర్థం.

1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫోటోగ్రఫీపై పేటెంట్ హక్కులు కొనుగోలు చేసి.. దానిని ప్రపంచానికి ఉచితంగా అందించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 19ని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ఇక మనదేశంలో కేవలం బ్రిటీష్ ఉన్నతాధికారులు, జమీందార్లు, సైనికులు మాత్రమే ఫోటోగ్రీఫీని ఉపయోగించేవారు. 1877 నుంచి దీనిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు.

మొదట్లో ఫోటోగ్రఫీ కెమెరాలు చాలా పెద్దగా ఉండేవి. కాలక్రమంలో ఎయిమ్ అండ్ షూట్ కెమెరాలు, ఫీల్డ్ కెమెరాలు,  డోనల్ కెమెరాలు, డిజిటల్ సింగిల్ లేన్స్ రిఫ్లెక్ట్ , ఫ్లై కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.

ఒకప్పుడు రీల్స్‌తో ఫోటోలు తీసే స్థాయి నుంచి ఇప్పుడు చిన్న మెమొరీ కార్డుతో వందలాది ఫోటోలు తీసే స్థాయికి ఫోటోగ్రఫీ చేరుకుంది. ఇంతటి పరిజ్ఞానం వెనుక ఎందరో శాస్త్రవేత్తల అధ్యయనాలు, పరిశోధనాలు, నిరంతర కృషి దాగివుంది. ఆ మహానీయులను ఒక్కసారి గుర్తు చేసుకోవడమే ఈ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం ముఖ్యోద్దేశం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios