టెక్సాస్‌లో కాల్పులకు పాల్పడ్డ దుండగుడు అంతకు ముందు ఓ అమ్మాయికి మెసేజ్‌లు పంపాడు. సోషల్ మీడియాలో తన గన్ ఫొటోలను షేర్ చేస్తూ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌కు ట్యాగ్ చేశారు. దీంతో చాలా మంది ఆమెను ఆ షూటర్ గర్ల్‌ఫ్రెండ్‌గా భావించారు. కానీ, ఆమె ఆ అనుమానాలను ఖండించింది. ఆ షూటర్ తనకు పంపిన మసేజ్లనూ బహిర్గతం చేసింది.