ఈరోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే.. కనీసం రూ.10వేలైనా వెచ్చించాలి. కానీ రూ.7000 ధరలో మంచి ఫీచర్లతో ఫోన్ అందిస్తోంది పోకో కంపెనీ. అదే పోకో సీ71సీ. ఇందులో 6.88-అంగుళాల HD+ 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీ, 32MP కెమెరా ఉన్నాయి. మూడు రంగుల్లో దొరికే ఇది ఏప్రిల్ 8న ఫ్లిప్కార్ట్ ద్వారా ఇండియాలో రిలీజ్ అవుతుంది, Samsung, Redmiతో పోటీ పడుతుంది.