Ladakh: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించిందనీ, మహిళా సాధికారత, వారి భద్రతకు భరోసా ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని సంబంధిత అధికారులు తెలిపారు. లడఖ్‌లోని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎస్డి సింగ్ జమ్వాల్ ఈ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారనీ, ఇది ప్రత్యేకంగా మహిళలపై నేరాలను అదుపు చేస్తుందని చెప్పారు. అవసరమైన మహిళలకు తక్షణ సహాయం, మద్దతు కోసం ఈ స్టేషన్ 24 గంటలూ పనిచేస్తుందని తెలిపారు.