Narendra Modi Exclusive Interview: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో న్యూస్‌వీక్ సీఈఓ దేవ్ ప్రగద్, గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ నాన్సీ కూపర్, ఆసియా ఎడిటోరియల్ డైరెక్టర్ డానిష్ మన్సూర్ భట్ లు 'నరేంద్ర మోదీ అండ్ ఇండియాస్ అన్‌డెన్‌డియబుల్ రైజ్' పేరిట ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో గత పదేండ్లలో ప్రధాన నరేంద్ర మోడీ నాయకత్వంలో సాధించిన ఆర్థిక పురోగతి, చైనాతో భారతదేశ సంబంధాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ ఆందోళనలు, ఉద్రిక్తత, ఎన్నికల్లో ముస్లింల ప్రతినిధ్యం, పత్రికా స్వేచ్ఛ వంటి విషయాలపై చర్చించారు.