భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని ఆయన న్యాయవాదులకు సూచనలు చేశారు. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దని, తప్పును ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయవద్దని అన్నారు. చివరగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.