ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న క్రీడ టెన్నిస్. మిగిలిన ఆటల్లాగే చెయ్యి, కన్ను సమన్వయంతో ఈ ఆట ఆడాల్సి ఉంటుంది. అలాగే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ‘‘ బ్యాలెన్స్’’ ఎందుకంటే మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లు తమ షాట్ల గురి తప్పకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి.

Also Read:జట్టు అక్కర్లేదు.. స్వార్థపరులు, వాళ్లలా ఆడొద్దు: భారత క్రికెటర్లపై ఇంజమామ్ సంచలన వ్యాఖ్యలు

అయితే డబ్ల్యూటీఏ గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ట్వీట్ చేసింది. ఇందులో ఓ బాలిక హులా హూప్ ( రింగ్ లాంటి వస్తువు)ను బాలెన్స్ చేస్తూనే మరోవైపు తన కుడిచేతిని ఉపయోగించి టెన్నిస్ రాకెట్‌తో బంతిని నిరంతరాయంగా బౌన్స్ చేస్తూ.. ఒకే సమయంలో రెండు పనులను చేస్తోంది.

రెండు పనులను ఒకేసారి చేయడానికి చాలా ఏకాగ్రత, దీక్ష, నిరంతర శిక్షణ, సహనం అవసరమని పలువురు ఆ బాలికను ప్రశంసిస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలకు తీవ్ర నష్టం కలిగినట్లే టెన్నిస్‌కు సైతం ఇబ్బందులు  తప్పలేదు.

Also Read:‘క్వారంటైన్ ప్రీమియర్ లీగ్’ ఆడేస్తున్న శిఖర్ ధావన్

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్  వంటి గ్రాండ్ స్లామ్‌లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే అభిమానులను ఉత్సాహ పరిచేందుకు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నాడు. ప్రతిరోజూ ఇంట్లో తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలను ఈ స్విస్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.