కరోనా వైరస్ కారణంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడటంతో క్రీడా ప్రముఖులు కుటుంబంతో గడపటంతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో బాగా టచ్‌లో ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం.. తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో సానియా తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది.

ఆ ఫోటో చూడటానికి చాలా అందంగా ఉంది. దానికి సానియా క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘ నువ్వు నా జీవితంలో భాగమైపోయావు’ అనే అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేశారు. కాగా..  దానికి #ourwalksandconversations అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.  అంటే.. నడుచుకుంటూ మాట్లాడుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.

దీంతో.. ఇంతకీ ఈ రోజు ఏం మాట్లాడుకున్నారు అంటూ ఓ ప్రముఖ టీవీ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కామెంట్స్ లో ప్రశ్నించారు. కాగా.. దానికి సానియా ఫన్నీ సమాధానం ఇచ్చారు. ఈ రోజు పదం.. కేక్ అండ్ మోర్ అని పేర్కొంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

You are part of me ,my little one ❤️ 🤱🏽#ourwalksandconversations 💞 @izhaan.mirzamalik

A post shared by Sania Mirza (@mirzasaniar) on Aug 26, 2020 at 7:50am PDT

 

కాగా.. కొడుకు, ఫోటోలు సానియా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటారు. ఇటీవల ఓ వీడియోని షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది.  ఈ వీడియోకు ‘ బాబాయ్ (అసద్) ఫోర్ కొడితే.. బాబా (షోయబ్ మాలిక్) సిక్సర్ కొడతారని సానియా కామెంట్ చేశారు. ఇక ఈ సంభాషణలో సానియా మీర్జా తన కుమారుడితో మాట్లాడుతూ.. కుక్క ఎలా అరుస్తుంది బేబీ అని అడిగితే.. దానికి ఇజాన్, బౌబౌ అంటూ కుక్కను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు.

అసద్ బాబాయ్ ఏం చేస్తారని అడిగితే ఫోర్ కొడతారని సానియా బదులిచ్చారు. అదే విధంగా బాబా (షోయబ్ మాలిక్) ఏం చేస్తారని అడుగుతూ.. బాబా సిక్సర్ బాదుతారని సానియా మీర్జా సరదాగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లతో  పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా దీనిని లైక్ చేస్తున్నారు.