Asianet News TeluguAsianet News Telugu

US OPEN: యూఎస్ ఓపెన్ స్వియాటెక్‌దే... రికార్డు సృష్టించిన పోలండ్ సంచలనం

US Open 2022:  మహిళల టెన్నిస్ లో ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్న ఇగా  స్వియాటెక్  సంచలన ప్రదర్శనతో యూఎస్ ఓపెన్  విజేతగా నిలిచింది. 
 

World No.1 Iga Swiatek Wins Her First US OPEN title, defeats Ons jabeur
Author
First Published Sep 11, 2022, 3:04 PM IST

ఈ  ఏడాది  ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన పోలండ్ టెన్నిస్ క్రీడాకారిణి,  మహిళల టెన్నిస్  ప్రపంచ నెంబర్ వన్ ఇగా  స్వియాటెక్ యూఎస్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన మహిళల సింగిల్స్ లో స్వియాటెక్..  6-2, 7-6 (7-5)   తేడాతో  ట్యూనీషియా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ 5 ఓన్స జబీర్ పై విజయం సాధించి  టైటిల్ గెలచుకుంది. 52 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా  స్వియాటెక్.. యూఎస్ ఓపెన్  నెగ్గిన తొలి పోలండ్  క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. 

శనివారం ముగిసిన ఈ పోరులో స్వియాటెక్.. ఆది నుంచి  ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిసెట్ ను 6-2తో  నెగ్గింది. అయితే రెండో సెట్ లో జబీర్ పుంజుకుంది.  స్వియాటెక్ కు గట్టి పోటీనిచ్చింది. కానీ  స్వియాటెక్  జోరు ముందు నిలువలేకపోయింది. 

ఈ విజయంతో  స్వియాటెక్.. 2013 తర్వాత ఒకే సీజన్ లో రెండు గ్రాండ్ స్లామ్ లు గెలిచిన తొలి మహిళా  క్రీడాకారిణిగా గుర్తింపు దక్కించుకుంది. స్వియాటెక్.. రోలండ్ గారస్ (ఫ్రెంచ్ ఓపెన్), యూఎస్ ఓపెన్ లను సొంతం చేసుకుంది.  2013లో  సెరెనా విలియమ్స్ ఈ ఘనత సాధించింది. 

 

ఈ ఏడాది ఆగస్టులో యూకే వేదికగా ముగిసిన వింబూల్డన్ గెలిచి తద్వారా  అదినెగ్గిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కిన జబీర్.. యూఎస్ ఓపెన్ నెగ్గి వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ లు గెలుచుకోవాలని చూసినా ఆమె కల నెరవేరలేదు. 

ఇక పురుషుల ఓపెన్ లో భాగంగా.. కార్లోస్  అల్కరజ్ - కాస్పర్ రుడ్ మధ్య నేడురాత్రి ఫైనల్ జరగనుంది. కాగా అల్కరజ్..  ఈటోర్నీలో ఆడుతున్నఅతి పిన్నవయస్కుడి (19ఏండ్లు) గా రికార్డులకెక్కనున్నాడు. 2005 లో భాగంగా ఫ్రెంచ్ ఓపెన్ లో రఫెల్ నాదల్ తర్వాత ఈ రికార్డుసాధించనున్న తొలి ఆటగాడిగా ఘనతకెక్కనున్నాడు. 
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios