Asianet News TeluguAsianet News Telugu

టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కి షాక్.. ఆట నుంచి తప్పించిన అధికారులు

 బంతి వెళ్లి మహిళా అధికారికి తగలగానే.. జకోవిచ్ వెంటనే ఆమె వద్దకు పరుగులు తీయడం గమనార్హం. కాగా.. ఈ మ్యాచ్ లో జకోవిచ్ ప్రత్యర్థి కారెనో బస్టా గెలిచినట్లుగా అంపైర్ ప్రకటించడం గమనార్హం

US Open 2020: World No. 1 Novak Djokovic Disqualified From The Tournament After Hitting Official With The Ball In Round Of 16
Author
Hyderabad, First Published Sep 7, 2020, 8:38 AM IST

టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో టెన్నిస్ టోర్నీలో పురుషుల సింగిల్స్ లో జకోవిచ్ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. గ్రాండ్ స్లామ్ కూడా కచ్చితంగా జకోవిచే గెలుస్తాడని అందరూ భావించారు. అయితే.. అనూహ్యంగా జకోవిచ్ కి ఊహించని షాక్ తగిలింది. అతనిని ఆట నుంచి అధికారులు తప్పించారు.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో జకోవిచ్ ఆడిన బంతి గీత దాటి వెళ్లి అక్కడి ఉన్నతాధికారులకు ఒకరికి తగిలింది. 16 మ్యాచ్ లో ఇలా జరిగింది. మహిళా అధికారికి బంతి బలంగా తగలడంతో.. అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు.  ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. జకోవిచ్ పై అనర్హత వేటు వేశారు.

కాగా.. బంతి వెళ్లి మహిళా అధికారికి తగలగానే.. జకోవిచ్ వెంటనే ఆమె వద్దకు పరుగులు తీయడం గమనార్హం. కాగా.. ఈ మ్యాచ్ లో జకోవిచ్ ప్రత్యర్థి కారెనో బస్టా గెలిచినట్లుగా అంపైర్ ప్రకటించడం గమనార్హం. కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో జకోవిచ్ తన ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ బయటకు వెళ్లిపోవడం విశేషం.

ఇలాంటి సంఘటనే 1990లో చోటుచేసుకుంది. ఓ సెర్బియన్ క్రీడాకారుడు ఇలానే ఆటలో పొరపాటు చేయడం వల్ల అనర్హత వేటుకి గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితి జకోవిచ్ కి మాత్రమే ఎదురైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios