కరోనా దెబ్బ: యూఎస్ ఓపెన్ కు నదాల్‌ దూరం, త్వరలో జకోవిచ్ నిర్ణయం

యూఎస్ ఓపెన్ సమీపిస్తున్న వేళ .... డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నదాల్‌ యూఎస్‌ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కరోనా వైరస్‌ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ఈ టోర్నీ‌ నుంచి వైదొలుగుతున్నట్టు స్పెయిన్‌ స్టార్‌ వెల్లడించాడు. 

US Open 2020 : In The wake of coronavirus, Rafael Nadal Withdraws, Novak Djokovic to Take Call in Coming Days

కరోనా వైరస్ కారణంగా క్రీడాలోకం అంతా పడకేసింది. ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమవుతున్నాయి. క్రికెట్ ప్రారంభమయింది. మొన్నామధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ లు అంటూ నిర్వహించిన ఒక టెన్నిస్ టోర్నీ వల్ల కరోనా సోకింది. ఏకంగా జకోవిచ్ సైతం ఆ వైరస్ బారినపడ్డ విషయం విదితమే. 

ఇక యూఎస్ ఓపెన్ సమీపిస్తున్న వేళ .... డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నదాల్‌ యూఎస్‌ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కరోనా వైరస్‌ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ఈ టోర్నీ‌ నుంచి వైదొలుగుతున్నట్టు స్పెయిన్‌ స్టార్‌ వెల్లడించాడు. 

‘కొవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారిని ఇప్పటివరకు నియంత్రించలేకపోయాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లకపోవడమే మంచిదని భావిస్తున్నాను’ అని నదాల్‌‌ ట్వీట్‌ చేశాడు. 

గాయం కారణంగా రోజర్‌ ‌, కొవిడ్‌-19 కారణంతో జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఆడడం లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఫెదరర్, నదాల్‌‌ లేకుండా 1999 తర్వాత యూఎస్‌ ఓపెన్‌ జరగనుండడం ఇదే తొలిసారి.జకోవిచ్ సైతం త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios