చెమటలు పట్టించిన భారతీయుడు: ఫెదరర్‌కు సుమిత్ నాగల్ షాక్
20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో భారతీయుడు షాకిచ్చాడు. తొలిసారి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న హర్యానా ఆటగాడు సుమిత్.... ఫెదరర్‌పై 6-4 తేడాతో తొలిసెట్లో ఈ కుర్రాడు పైచేయి సాధించాడు
20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత, ప్రపంచ మాజీ నెంబర్‌వన్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యూఎస్ ఓపెన్‌లో భారతీయుడు షాకిచ్చాడు. తొలిసారి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న హర్యానా ఆటగాడు సుమిత్.... ఫెదరర్‌పై 6-4 తేడాతో తొలిసెట్లో ఈ కుర్రాడు పైచేయి సాధించాడు.
అయితే ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ తలవంచక తప్పలేదు. ఆ వెంటనే 6-1,6-2,6-4 తేడాతో ఫెదరర్ విజయం సాధించాడు.
అయితే గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలో గత 20 ఏళ్లలో ఓ సెట్ గెలుచుకున్న నాలుగో భారత ఆటగాడిగా సుమిత్ నిలిచాడు. ఓడిపోయినప్పటికీ... ఫెదరర్ వంటి దగ్గజానికి చెమటలు పట్టించాడని అతనిని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
సుమిత్ నాగల్ 190 ర్యాంకుతో టోర్నమెంటులోకి అడుగు పెట్టాడు. తొలి సెట్ ను ఫెదరర్ పై గెలుచుకోవడంతో ప్రేక్షకుల జోకులతో నవ్వులు పూశాయి. అయితే, ఫెదరర్ మాత్రం సీరియస్ అయిపోయాడు. 2003 తర్వాత ఫెదరర్ తొలిసారి ఈ పరిస్థితిని ఎదుర్కున్నాడు. అయితే, ఆ తర్వాత ఆటపై ఫెదరర్ పట్టు బిగించి విజయం సాధించాడు.