Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ ఓపెన్‌ విజేత రఫెల్ నాదల్..ఫెదరర్ రికార్డుకు అడుగు దూరంలో

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా క్రీడాకారుడు డానియల్ మెద్వెద్వెన్‌‌పై 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. తద్వారా కెరీర్‌లో 19వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

US Open 2019: Rafael Nadal Beats Daniil Medvedev In US Open Final
Author
United States, First Published Sep 9, 2019, 7:27 AM IST

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా క్రీడాకారుడు డానియల్ మెద్వెద్వెన్‌‌పై 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. తద్వారా కెరీర్‌లో 19వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టిన డానియల్ గెలుపు కోసం మంచి పోరాటమే చేశాడు. తొలి రెండు సెట్లను నాదల్ కైవసం చేసుకున్నప్పటికీ.. మెద్వెద్వెవ్ ఎక్కడా తగ్గలేదు. మూడు, నాలుగు సెట్లను 7-5, 6-4 తేడాతో గెలిచి గట్టి పోటీనిచ్చాడు.

అయితే చివరి సెట్‌లో నాదల్ అనుభవం ముందు డానియల్ నిలవలేకపోయాడు. ఇంకొక్క విజయం సాధిస్తే... పురుషులు సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించిన రోజర్ ఫెదరర్‌తో సమానంగా నిలుస్తాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios