ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోరులో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో నాదల్ ఓటమి చవిచూశాడు

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ పోరులో స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో నాదల్ ఓటమి చవిచూశాడు. వరుసగా రెండు సెట్లు గెలిచిన అతడు చివరి మూడు సెట్లను చేజార్చుకున్నాడు. 3-6, 2-6, 7-6 (4), 6-4, 7-5 తేడాతో పరాజయం పాలయ్యాడు.

ఒక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచులో నాదల్‌ రెండు సెట్ల ఆధిపత్యం సొంతం చేసుకోవడం ఇది 225వ సారి కావడం విశేషం. కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ఆధిపత్యాన్ని కోల్పోయి ఓటమి పాలవ్వడం గమనార్హం.

కొన్ని అనవసర తప్పిదాలు, బ్యాక్‌హ్యాండ్‌ లోపాలతో మూడో సెట్‌ ట్రైబేకర్‌లో అతడికి చుక్కెదురైంది. దీంతో రోజర్‌ ఫెదరర్‌ను అధిగమించాలన్న అతడి కల నెరవేరలేదు. ప్రస్తుతం నాదల్‌, ఫెదరర్‌ అత్యధికంగా చెరో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సమానంగా ఉన్నారు.