Asianet News TeluguAsianet News Telugu

vogue India: వోగ్ ఇండియా మ్యాగజైన్ పై భారత ఒలింపిక్ విజేతలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Tokyo Olympics: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టిన భారత క్రీడాకారిణులు పివి సింధు (pv sindhu), బాక్సర్లు లవ్లీనా బోర్గొహెయిన్ (lovlina borgohain), మీరాబాయి చాను (mirabai chanu) లు  ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ వోగ్ ఇండియా (vogue india) కవర్ పేజీ మీద మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Tokyo olympic champions pv sindhu, mirrabai chanu and lovlina borgohain feature in vogue india magazine cover page see pics  here
Author
Hyderabad, First Published Oct 2, 2021, 6:12 PM IST

టోక్యో ఒలింపిక్స్ లో పతకాలతో మెరిసిన భారత స్టార్ షట్లర్ పివి సింధు, బాక్సర్లు లవ్లీనా బొర్గొహెయిన్, మీరాబాయి చానులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఒలింపిక్స్ లో మీరాబాయి రజతం నెగ్గగా.. లవ్లీనా, సింధులు కాంస్య పతకాలు సాధించారు. కాగా తాజాగా ఈ ముగ్గురు యువ క్రీడాకారిణులు వోగ్ ఇండియా మ్యాగజైన్ ముఖచిత్రం మీద  మెరిశారు. మూడు సంచికలుగా వెలువడుతున్న ఈ మ్యాగజైన్ లో చాను, సింధు, లవ్లీనా గ్లామర్ గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

 

‘గత కొద్దికాలంగా క్రీడాకారులు మానసిక ఆరోగ్యం కారణంగా కొంతకాలం నుంచి  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మీరాబాయి చాను మాత్రం ఆ భారాన్ని వదిలించుకుంది. తనను తాను నమ్ముకుంది. మా అక్టోబర్ 2021 సంచికలో ఈ సిల్వర్ మెడల్ స్టార్ గురించి తెలుసుకోండి’ అని వోగ్ ఇండియా ట్వీట్ చేసింది. 

 

‘అసమానతలను ధిక్కరించాలని నిశ్చయించుకుని ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన లవ్లీనా విజయం కేవలం ఆమెవిజయగాథ మాత్రమే కాదు. ప్రతి అమ్మాయి కోరుకునే విజయాలలో ఒకటి’ అని లవ్లీనా కవర్ పేజీ షేర్ చేసింది. 

 

‘భారత్ లో అత్యధిక మార్కెట్ ఉన్న మహిళా క్రీడాకారిణి మరియు ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారిణిలలఓ ఒకరైన పివి సింధు మహిళల సింగిల్స్ లో కాంస్యంతో భారత స్టార్ లలో ఒకరిగా స్థిరపడింది. మా అక్టోబర్ 2021 కవర్ పేజీ లో సింధు గురించి మరింత తెలుసుకోండి’ అంటూ వోగ్ ట్వీట్ చేసింది. 

 

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంచిక త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నది. కాగా, ఒలింపిక్స్ లో కాంస్యం నెగ్గిన తెలుగమ్మాయి పివి సింధు..  త్వరలోనే విశాఖపట్నంలో  బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. లవ్లీనా కూడా సింధు భాటలోనే పయనిస్తున్నది. ఆమె కూడా అస్సాంలో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేసే పనిలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios