ఉక్రెయిన్ చిన్నారుల కోసం కదిలిన రోజర్ ఫెడరర్... పాఠశాలల కోసం భారీ విరాళం..

Ukraine: ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రభావిత చిన్నారుల విద్యా వసతుల కోసం 5 లక్షల డాలర్లు విరాళం ప్రకటించిన రోజర్ ఫెడరర్... 

Tennis Star Roger Federer donates 5 lakh dollars to Ukraine Children Education

స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్, రష్యాతో యుద్ధం కారణంగా అన్ని విధాలుగా నష్టపోతున్న ఉక్రెయిన్ కోసం ముందుకు కదిలాడు. రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో నగరాలు, భవనాలు, పార్కులు, పాఠశాలలు పెద్ద ఎత్తునన ధ్వంసమయ్యాయి...

ఉక్రెయిన్‌ను తమ హస్తగతం చేసుకునేందుకు భీకరమైన యుద్ధం చేస్తోంది రష్యా. రష్యాకి లొంగకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది ఉక్రెయిన్. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ఎంతో మంది చిన్నారులు విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తోంది...

పాఠశాలలు ధ్వంసం కావడంతో చదువుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది విదేశాలకు వలస వెళ్తుంటే, వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్ పరిస్థితి చూసి, చలించిపోయిన రోజర్ ఫెడరర్... తనవంతుగా ఆర్థిక సాయం ప్రకటించాడు..

‘ఉక్రెయిన్‌లో పరిస్థితులకు సంబంధించిన ఫోటోలను చూసి నేను, నా కుటుంబం భయాందోళనలకు గురయ్యాం. ఎంతో మంది అమాయక ప్రజలు, ఈ యుద్ధం కారణంగా చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మం శాంతి కోసం నిలబడదాం...

ఉక్రెయిన్‌లో సాయం కోసం చూస్తున్న చిన్నారుల కోసం అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. ఉక్రెయిన్‌లో దాదాపు 6 మిలియన్ల మంది చిన్నారులు... స్కూళ్లు ధ్వంసం కావడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చదువుకోవడం ఎంత కష్టమో మాకు తెలుసు. అందుకే ఈ దారుణ పరిస్థితుల నుంచి బయటికి వచ్చేందుకు వారికి సాయం చేసేందుకు మేం సిద్ధమయ్యాం.

రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ ద్వారా ఉక్రెయిన్‌లో యుద్ధ ప్రభావ పిల్లలకు విద్యా వసతులు ఏర్పాటు చేసేందుకు వీలుగా 5 లక్షల స్విస్ డాలర్లు (దాదాపు 4 కోట్ల 7 లక్షల రూపాయలకు పైగా) విరాళంగా అందచేస్తున్నా...’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్.

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్, రోజర్ ఫెడరర్‌ను అధిగమించి టాప్‌లోకి దూసుకెళ్లాడు...

కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోయిన సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ కూడా 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో రోజర్ ఫెడరర్‌తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios