మల్లోర్కా: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పరిచయమైన షిస్క పెరెల్లో ను పెళ్లాడాడు. కేవలం కొద్దీ మంది దగ్గర వ్యక్తుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించి ఎటువంటి ఫోటోలు బయటకు రాలేదు. 

స్పెయిన్ దేశంలో అందమైన మల్లోర్కా ద్వీపంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు స్పెయిన్ రాజు కార్లోస్ కూడా వచ్చినట్టు సమాచారం. మీడియాలో ఎప్పటినుండో వీరిరువురి రేలషన్ షిప్ గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. రఫా కొంచం ఓపెన్ గానే ఉన్నప్పటికీ అతని ప్రేయసి మాత్రం చాలా లౌ ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఎక్కువగా ఎవరికీ కనపడేది కాదు. 

14 సంవత్సరాల క్రితం, ఒక వేడుకలో పరిచయమైన తన చెల్లెలి ఫ్రెండ్ తో పరిచయం పెరిగి స్నేహానికి దారి తీయడం, అటు నుండి అది ప్రేమగా మారడం ఇప్పుడు అది పాకాన పడి వారిరువురు పెళ్లి చేసుకున్నారు.