రఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సహా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

టెన్నిస్‌ అగ్ర ఆటగాడు, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ సహా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 13 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన నాదల్‌.. ఈ ఏడాది సెమీఫైనల్లో జకోవిచ్‌ చేతిలో అనూహ్య ఓటమి చెందాడు. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ నడుమ రెండు వారాల వ్యవధి మాత్రమే ఉండటంతో ఫిట్‌నెస్‌, కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని నాదల్‌ తెలిపాడు. ' ఈ ఏడాది వింబుల్డ్‌న్‌ గ్రాండ్‌స్లామ్‌, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. నా ఫిట్‌నెస్‌, నా జట్టుతో చర్చించిన అనంతరం ఇదే సరైన నిర్ణయమని అనుకున్నాను' అని రఫెల్‌ నాదల్‌ ట్వీట్‌ చేశాడు.

Scroll to load tweet…

ఇక జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ను కైవసం చేసుకోవడంతో మరోసారి టెన్నిస్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అనే చర్చ మరోసారి మొదలయింది. టెన్నిస్‌ చరిత్రలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను రెండుసార్లు సొంతం చేసుకున్న మూడో ఆటగాడిగా జకోవిచ్‌ నిలిచాడు. గత 52 ఏండ్లలో నొవాక్‌ జకోవిచ్‌ సాధించిన ఘనతను మరో ఆటగాడు అందుకోలేదు. 34 ఏండ్ల సెర్బియా యోధుడు ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఐదు సెట్ల మ్యాచ్‌లో గ్రీసు సంచలనం స్టిఫానోస్‌ సిట్సిపాస్‌ను ఓడించి.. కెరీర్‌ 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వశపరుచుకున్నాడు. రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌లు 20 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ విజయంతో పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది.