ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా..  పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కాగా... వీరి వివాహం సరిగా 11 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో.. సానియా మీర్జా తన భర్తకు ప్రేమగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

అయితే.. భర్త షోయబ్ మాత్రం పెళ్లిరోజు విషెస్ విషయంలో పెద్ద బ్లండర్ మిస్టేక్ చేయడం గమనార్హం. ఏకంగా పెళ్లి రోజే మర్చిపోయాడు. తర్వాతి రోజు విష్ చేయడం గమనార్హం. అయితే.. ఈ మిస్టేక్ ఆయన చాలా సార్లు చేశానని ఒప్పుకోవడం కొసమెరుపు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

 

‘ మళ్లీ మర్చిపోయాను.. ఎప్పటిలాగా ఆలస్యంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను. లవ్ యూ సానియా టూ ది మూన్ అండ్ బ్యాక్’ అంటూ పోస్టు చేశాడు. దాని పక్కన కన్ను కొడుతున్న ఎమోజీ, ఒక హార్ట్ ఎమోజీ కూడా పెట్టడం విశేషం.

 

కాగా.. సానియా మాత్రం.. ఒక రోజు ముందే భర్తకు ప్రేమగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. భర్త షోయబ్ తో కలిసి దిగిన రెండు ఫోటోలు షేర్ చేసి.. మరీ విషెస్ చెప్పింది.ఆ ఫోటోల్లో ఒక ఫోటోలో తాను లావుగా ఉన్నది.. మరో ఫోటోలో బరువు తగ్గి నార్మల్ అయినవి పెట్టడం విశేషం. ‘లావుగా ఉన్నా సన్నగా ఉన్నా.. మంచైనా చెడైనా.. హ్యాపీ బర్త్ డే మైన్’ అంటూ 11వ పెళ్లి రోజు విషెస్ చెప్పింది. ఆ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

సానియా, షోయబ్ లో 2010లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. షోయబ్ చివరగా..2020 సెప్టెంబర్ లో ఇంగ్లాండ్ తో అంతర్జాతీయ టీ20 కోసం తలపడ్డాడు.