ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ క్రీడాకారిణీ సెరెనా విలియమ్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది.

మహిళల టెన్నిస్ చరిత్రలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు కొట్టి చరిత్ర సృష్టించాలనుకున్న సెరెనాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ అమెరికా టెన్నిస్ స్టార్‌కు కాలి మడమ గాయంతో ఈ ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ నుంచి వైదొలగింది.

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో సెరెనా 7-6, 6-0 తేడాతో ఆన్‌పై విజయం సాధించింది. రెండో రౌండ్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పాత గాయం తిరగబెట్టడంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది.