టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె సోదరి ఆనమ్  వివాహం ఈ వారంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన సంబరాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే తాజాగా సోమవారం మెహందీ వేడకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆనమ్.. తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

కాగా... ఆ ఫోట్లో ఆనమ్ ఎంతో అందంగా ఉంది. రెండు చేతులకు మెహందీ పెట్టుకొని..డిజైనర్ వేర్ లంగావోణీ వేసుకుంది. పక్కనే సానియా మీర్జా కూడా ఉంది. సానియా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించారు. కాగా... ఇప్పుడు వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డ్రస్ లో ఆనం చాలా అందంగా ఉన్నావంటూ కొందరు.. మెరిసిపోతున్నావంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఫోటోకి 8వేలకు పైగా లైకులు.. వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా.. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఆనం మీర్జాకి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.  అసద్, ఆనం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో... వారు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వారం వీరి పెళ్లి జరగనుంది.

 

స్టైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అసద్ ను వివాహమాడనుంది. ఆనంమీర్జా కూడా తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ కుమారుడు అసద్ తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు.ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులు కానున్నారు.