పదో పెళ్లి రోజు... అలా ఊహించుకుంటే.. ఇలా.. సానియా మీర్జా పోస్ట్

వాటిలో తొలి ఫొటోను ఉద్దేశించి అంచనాలు ఇలా ఉంటాయని, రెండో ఫొటోలో వాస్తవికత ఇలా ఉంటుందని వివరించింది. మొదటి ఫొటోలో షోయబ్, సానియా ఎంతో హుందాగా కనిపిస్తుండగా, రెండో ఫొటోలో కొంటెగా దర్శనమిచ్చారు.
Sania Mirza's "Expectation vs Reality" Post For Shoaib Malik On 10th Marriage Anniversary
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి జరిగి సరిగ్గా పది సంవత్సరాలు అవుతోంది. ఆదివారం వారి పదో పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన భర్తకు సోషల్ మీడియా వేదికగా.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

Also Read కరోనా ఫైట్.. సానియా మీర్జా భారీ నిధుల సేకరణ...

అయితే... ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఎలా జరగాల్సిన తమ పెళ్లి రోజు.. ఇలా జరిగిందంటూ ఆమె పెట్టిన ఓ ఫన్నీ పోస్టు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇంతకీ మ్యాటరేంటంటే...సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్టు చేసింది. ఆదివారం ఆమె పెళ్లి రోజు కావడంతో 10 ఏళ్ల వైవాహిక జీవితం సందర్భంగా భర్త షోయబ్ మాలిక్ కు హ్యాపీ యానివర్సరీ అంటూ విషెస్ తెలిపింది. అంతేకాదు, ఇరువురికి సంబంధించిన రెండు ఫొటోలను పోస్టు చేసింది. 

ఆ రెండు ఫొటోల మధ్య పోలిక తెస్తూ, "పదేళ్ల దాంపత్య జీవితం ఇలా ఉంటుంది...  ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ" అంటూ క్యాప్షన్ పెట్టింది. వాటిలో తొలి ఫొటోను ఉద్దేశించి అంచనాలు ఇలా ఉంటాయని, రెండో ఫొటోలో వాస్తవికత ఇలా ఉంటుందని వివరించింది. మొదటి ఫొటోలో షోయబ్, సానియా ఎంతో హుందాగా కనిపిస్తుండగా, రెండో ఫొటోలో కొంటెగా దర్శనమిచ్చారు.

ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పై పోరాడటానికి భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందుకొచ్చింది. క‌రోనా కార‌ణంగా పూట గ‌డువ‌ని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నకుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి 25 లక్ష‌లు సేక‌రించింది. వీటి ద్వారా అన్నార్థుల‌కు స‌హాయం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. 

Also Read కరోనా లాక్‌డౌన్: తల్లిసేవలో జస్ప్రీత్ బుమ్రా, రెండుసార్లు ఫ్లోర్ క్లీనింగ్...

‘కొవిడ్-19 వైర‌స్‌తో తిన‌డానికి తిండి లేకుండా రోడ్డున ప‌డ్డ వారి కోసం ఏమ‌న్న చేయాల‌న్న త‌లంపుతో ఒక గ్రూపుగా ఏర్ప‌డ్డాం. వారం వ్య‌వధిలో కోటి 25 ల‌క్ష‌ల‌తో వేల కుటుంబాలకు అన్న‌దానం చేయ‌నున్నాం. ఈ డ‌బ్బుతో దాదాపు ల‌క్ష మందికి స‌హాయం అందుతుంది. దీన్ని మేమంద‌రం క‌లిసి ఇంకా కొన‌సాగిస్తాం. @యూత్‌ఫీడ్ఇండియా @సేఫ్ఇండియా’ అంటూ సానియా ట్వీట్ చేసింది. క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో ప‌లువురు క్రీడాకారులు విరాళాలు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios