Asianet News TeluguAsianet News Telugu

Wimbledon: సెమీస్ చేరిన సానియా మీర్జా.. చివరి వింబూల్డన్ లో జోరుమీదున్న హైదరాబాదీ స్టార్

Wimbledon 2022: ఇండియా  వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి వింబూల్డన్ లో అదరగొడుతున్నది. మిక్స్డ్ డబుల్స్ లో పావిక్ తో జతకట్టిన ఆమె సెమీస్ కు చేరింది. 
 

Sania Mirza-Mate Pavic Reach Mixed Doubles Semis in Wimbledon 2022
Author
India, First Published Jul 5, 2022, 12:13 PM IST

యూకే వేదికగా జరుగుతున్న వింబూల్డన్-2022 లో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతున్నది. మిక్స్డ్ డబుల్స్ లో క్రొయేషియా కు చెందిన మేట్ పావిక్ తో కలిసి జతకట్టిన  సానియా.. క్వార్టర్స్ లో  6-4, 3-6, 7-5 తేడాతో నాలుగ‌వ సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడిని మట్టికరిపించింది. ఆరో సీడ్ గా బరిలోకి దిగిన సానియా-పావిక్ ల జోడీ  మ్యాచ్ లో రెండో రౌండ్ లో కాస్త తడబడినా మొదటి, మూడో రౌండ్ లో ఆధిక్యాన్ని సాధించి విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్ లో సానియా తనదైన ఫోర్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది.

మిక్స్డ్ డబుల్స్ ఆడుతూ వింబూల్డన్ సెమీస్ చేరుకోవడం సానియాకు ఇదే ప్రథమం కావడం విశేషం. కాగా.. సెమీస్ లో సానియా-పావిక్ ల జోడీ.. నేడు జరిగే రెండో మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్ లో విజేతతో పోటీ పడుతుంది. 

వింబూల్డన్-2022 లో మిక్స్డ్ డబుల్స్ తో పాటు ఉమెన్ డబుల్స్ లో కూడా సానియా బరిలో ఉంది.  చెక్ రిపబ్లిక్ కు చెందిన లూసీతో కలిసి ఆమె డబుల్స్ లో పాల్గొంటున్నది. కానీ తొలి రౌండ్ లోనే ఈ జోడీ 6-4, 4,-6, 2-6 తేడాతో ఫ్రెచ్-బీట్రిజ్ ల చేతిలో ఓడింది. 

 

ఇక వింబూల్డన్ మిక్స్డ్ డబుల్స్ లో తొలి రౌండ్ లో జార్జియా కు చెందిన నటెలా జలమిడ్జ్-వెగ హెర్నాండెజ్ (స్పెయిన్) లపై గెలిచిన సానియా.. రెండో రౌండ్ లో ివాన్ డొడిగ్-లతిషా చన్ జోడీ పై నెగ్గి క్వార్టర్స్ చేరింది. 

 

ఇదిలాఉండగా  సానియాకు ఇదే చివరి వింబూల్డన్. ఈ ఏడాది ఆమె రిటైర్ అవుతున్నట్టు  గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ లో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైన తర్వాత ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ తర్వాత తాను రిటైరవుతున్నట్టు ఆమె వెల్లడించింది. 

19 ఏండ్ల వయసులోనే  టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. ఒకరకంగా భారత  మహిళల టెన్నిస్ కు  ముఖచిత్రంగా ఉంది. 2003లో  టెన్నిస్ రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ.. కెరీర్ ఆరంభంలో సింగిల్స్ లో మెరిసినా తర్వాత డబుల్స్ కే పరిమితమైంది.  సింగిల్స్ లో 2007 మిడ్ సీజన్ లో ఆమె ప్రపంచ మహిళల ర్యాకింగ్స్ లో 27 వ స్థానానికి చేరింది.  సింగిల్స్ కెరీర్ లో ఆమెకు అదే ఉత్తమ  ర్యాంకు. 

Follow Us:
Download App:
  • android
  • ios