Asianet News TeluguAsianet News Telugu

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం... సానియా రియాక్షన్ సూపర్..!

 టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఆ ప్రశ్న.. దానికి ఆమె రియాక్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Sania Mirza has epic reaction to TV show's weird question to a participant
Author
First Published Dec 30, 2022, 9:42 AM IST | Last Updated Dec 30, 2022, 9:42 AM IST

మీరు చాలా రకాల టీవీ షోలో చూసే ఉంటారు. వాటిల్లో మీలో ఎవరు కోటీశ్వరుడు అని తెలుగు లో కూడా వచ్చింది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతీ పేరిట ఈ పోగ్రామ్ చేశారు. అన్ని భాషల్లోనూ చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇలాంటిదే  అమెరికాలో ఓ టీవీ షో ఉంది. అదే ‘ హూ వాంట్స్ టూ బి ఏ మిలీనియర్..?’ అని... ఈ షో లో అడిగిన ఓ ప్రశ్నకు... టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఆ ప్రశ్న.. దానికి ఆమె రియాక్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.... ఈ నెల 29వ తేదీన సానియా....  'హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్?' ప్రోగ్రాంలో ఓ వ్యక్తిని అడిగిన ప్రశ్నను షేర్ చేసిన సానియా... అలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమంటూ రియాక్షన్ ఇచ్చింది.

 

ఇంతకీ ప్రశ్న ఏంటో తెలుసా..? ‘ ఎనిమిది వారాల గర్భవతిగా ఉన్న సమయంలోనూ టెన్నిస్ ఆడి.. ఆస్ట్రేలియాన్ ఓపెన్ గెలిచిన క్రీడాకారిణి ఎవరు’ ఇది ప్రశ్న. నిజానికి టెన్నిస్ గురించి అవగాహన ఉన్నవారు తప్పితే.. మరెవరూ దీనికి సమాధానం చెప్పలేరు. కానీ... అక్కడ ఇచ్చిన ఆప్షన్స్  చూస్తే మాత్రం చెప్పడం చాలా సులభం ఎందుకో తెలుసా..? ఆ ఆప్షన్స్ లో మూడింట్లో మగవారి పేర్లు.. ఒకదాంట్లో  సెరెనా విలియమ్స్ పేరు ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారా అంటూ.. నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నకు తప్పు సమాధానం ఇస్తే.. ఎలా ఉంటుంది అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ మరింత ఫన్నీగా ఉండటం విశేషం.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios