Asianet News TeluguAsianet News Telugu

Russia Ukraine Crisis: ఒక ఆటగాడిగా నేను కోరుకునేది అదే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మెద్వెదెవ్ కీలక ప్రకటన

Daniil Medvedev: సుమారు  21 ఏండ్ల తర్వాత రష్యా నుంచి  ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు మెద్వెదెవ్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అతడు స్పందిస్తూ.. 
 

Russia - Ukraine Crisis : Daniil Medvedev calls for Peace After He becomes Men's Tennis Number one
Author
India, First Published Feb 25, 2022, 2:41 PM IST

పురుషుల టెన్నిస్ ప్రపంచంలో రారాజు  నొవాక్ జకోవిచ్ ను వెనక్కినెట్టి  నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు డెనిల్ మెద్వెదెవ్. సుమారు 21 ఏండ్ల తర్వాత రష్యా నుంచి టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్  ర్యాంకు సొంతం చేసుకున్న  మెద్వెదెవ్.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య  నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించాడు. ఒక టెన్నిస్ ఆటగాడిగా తాను  శాంతిని కోరుకుంటానని, యుద్ధాన్ని విరమించాలని  కోరాడు. క్రీడాకారుడిగా తాను ఎన్నో దేశాలు తిరుగుతానని.. ఏ దేశానికి వెళ్లినా తాను శాంతిని కాంక్షిస్తానని తెలిపాడు. 

ఉక్రెయిన్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న రష్యా తీరుకు నిరసనగా స్వయంగా ఆ దేశ ప్రజలు  ఆందోళనలు చేస్తున్నా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని కోరుతూ ఇప్పటికే ఆ దేశానికి చెందిన ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. 

 

పలువురు క్రీడాకారులు కూడా ఈ అంశంపై గళం విప్పుతున్నారు. ఫుట్బాల్, టెన్నిస్, ఎఫ్1 రేస్ ఆటగాళ్లంతా  రష్యా తీరును నిరసిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై రష్యా టెన్నిస్ ఆటగాడు డెనిల్ మెద్వదెవ్ స్పందిస్తూ.. ‘ఒక టెన్నిస్ క్రీడాకారుడిగా నేను శాంతిని కోరుకోవడమే గాక  దానిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాను. ఆటగాళ్లుగా మేం వివిధ దేశాలు తిరుగుతాం.  జూనియర్లుగా గానీ,  సింగిల్స్ లో డబుల్స్ లలో  ప్రత్యర్థులతో పోటీ పడతాం. ఒక ఆటగాడిగా ఇలాంటి వార్తలు వినాల్సి రావడం బాధాకరం. నేను శాంతి కాముకుడిని...’ అని తెలిపాడు.  

21 ఏండ్ల తర్వాత నెంబర్ వన్.. 

సోమవారం ప్రకటించబోయే డానిల్ మెద్వదేవ్ రికార్డు సృష్టించాడు. సోమవారం ప్రకటించబోయే  ఏటీపీ  ర్యాంకింగ్స్ లో మెద్వెదెవ్ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ గా అవతరించనున్నాడు. తన కెరీర్ లో ఇంతవరకూ ఒక గ్రాండ్ స్లామ్ మాత్రమే నెగ్గిన అతడు.. రష్యా మాజీ ఆటగాళ్లు  కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత టెన్నిస్ లో నెంబర్ వన్ ర్యాంకుకు ఎదిగిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  మారత్ సఫిన్.. 2000 నవంబర్ నుంచి 2001 ఏప్రిల్ దాకా (9 నెలల పాటు) ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు. ఆ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించింది మెద్వెదెవ్ మాత్రమే.  ఈ జాబితాలో మరియా షరపోవా కూడా (2005లో, 2012లో) నిలిచినా.. ఆమె మహిళల విభాగంలో నెంబర్ వన్ అయింది. 

యూఏఈ వేదికగా జరుగుతున్న దుబాయ్ ఓపెన్ లో  కనీసం సెమీస్ చేరితే గానీ నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకునే స్థితిలో ఉన్న నొవాక్ జొకోవిచ్ (సెర్బియా).. గురువారం జరిగిన క్వార్టర్స్ లతో జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో అనూహ్య ఓటమి పాలయ్యాడు. ఈ గేమ్ లో జొకోవిచ్.. 4-6, 6-7 (4-7) తేడాతో ఓడిపోయాడు. దీంతో అతడు నెంబర్ వన్ స్థానాన్ని సైతం కోల్పోయాడు. 

కాగా..  2004 తర్వాత టెన్నిస్ ప్రపంచంలో  ఫెదరర్, నాదల్, జొకోవిచ్, ముర్రే లే నెంబర్ వన్ ర్యాంకు కోసం పోటీ పడుతున్నారు. ఈ నలుగురినీ కాదని తొలిసారి మెద్వెదెవ్ నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకోవడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios