రోజర్ ఫెదరర్‌కి గాయం... ఆస్ట్రేలియా ఓపెన్‌కి దూరమైన స్టార్ ప్లేయర్...

2000 ఏడాదిలో టెన్నిస్ కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి ప్రతీ సీజన్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడిన రోజర్ ఫెదరర్...

ఫెదరర్ మోకాలికి రెండు రౌండ్ల సర్జరీ... 

Roger Federer out of Australia Open 2021 for the first time due to Knee Injury CRA

టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ రోజర్ ఫెదరర్... ఆస్ట్రేలియా ఓపెన్‌కి కూడా దూరం కాబోతున్నాడు. 39 ఏళ్ల స్విస్ టెన్నిస్ స్టార్, గత ఫిబ్రవరి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 20 గ్రాండ్ స్లామ్ గెలిచిన రోజర్ ఫెదరర్.. 2000 ఏడాదిలో టెన్నిస్ కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి ప్రతీ సీజన్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడాడు. 

రోజర్ ఫెదరర్‌ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఫెదరర్ మోకాలికి రెండు రౌండ్ల సర్జరీ నిర్వహించిన వైద్యులు, విశ్రాంతి అవసరమని సూచించారు. ఇప్పటిదాకా ఆరుసార్లు ఆస్ట్రేలియాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఫెదరర్ లేకపోవడం 2021 ఆస్ట్రేలియా ఓపెన్‌కి వెలితిగా మిగిలిపోతుందని చెప్పాడు టోర్నీ చీఫ్ క్రాగ్ టిలే.

జనవరిలో నోవాక్ జొకోవిచ్ చేతిలో మెల్‌బోర్న్ సెమీ ఫైనల్‌లో ఓడిన తర్వాత టెన్నిస్‌కి దూరంగా ఉన్నాడు రోజర్ ఫెదరర్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios