ఆ గాయం తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. సానియా మీర్జా
ఒలంపిక్స్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన తర్వాత.. ఆమె బాగా డిప్రెషన్ కి గురయ్యారట. ఆ డిప్రెషన్ దాదాపు నెలల పాటు కొనసాగిందని ఆమె పేర్కొన్నారు.
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే.. ఇప్పుడు కాదులేండి... గాయంతో బీజింగ్(2008) ఒలంపిక్స్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన తర్వాత.. ఆమె బాగా డిప్రెషన్ కి గురయ్యారట. ఆ డిప్రెషన్ దాదాపు నెలల పాటు కొనసాగిందని ఆమె పేర్కొన్నారు.
మూడు, నాలుగు నెలలు తాను మానసిక సమస్యలతో సతమతమయ్యానని తెలిపింది. ముంజేతి గాయంతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బెనెసోవాతో తొలి రౌండ్ పోరు మధ్యలో సానియా వైదొలిగింది. అప్పటికి సానియా 1-6, 1-2తో వెనుకంజలో ఉంది. ఆ సందర్భాన్ని ఆమె ఓ చానెల్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ‘ముంజేతి గాయంతో ఒలింపిక్స్ టెన్నిస్ మ్యాచ్‌నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఫలితంగా 3-4 నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. మళ్లీ టెన్నిస్ ఆడతానో లేదోననే భయం వెంటాడింది. కారణం లేకుండా ఏడుస్తున్నట్టు నాకు గుర్తుంది. అప్పటివరకు బాగానే ఉండేదాన్ని. అంతలోనే దుఃఖం తన్నుకొచ్చేది. భోజనం చేయడానికి కూడా గది నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు’ అని వివరించింది.