నాదల్ రికార్డును సమం చేసిన జకోవిచ్.. స్పందించిన స్పెయిన్ బుల్

Novak Djokovic: ఆస్ట్రేలియా ఓపెన్ లో భాగంగా ఆదివారం  ముగిసిన  పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో  సెర్బియా స్టార్  నొవాక్ జకోవిచ్..  స్టెఫనోస్ సిట్సిపాస్ ను ఓడించి తన కెరీర్ లో  22వ గ్రాండ్ స్లామ్ ను  దక్కించుకున్నాడు. 

Rafael Nadal Responds As Novak Djokovic Equals His 22 Grand Slams MSV

ఆధునిక టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజంగా వెలుగొందుతున్న  సెర్బియా  స్టార్ నొవాక్ జకోవిచ్.. అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్ లో అదరగొట్టాడు. ఆదివారం  మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో జకోవిచ్..  6-3, 7-6 (7-4), 7-6 (7-5) తేడాతో  గ్రీస్ కుర్రాడు స్టెఫనోస్ సిట్సిపాస్ పై  విజయం సాధించాడు. అయితే  ఈ విజయంతో  జకోవిచ్.. తన గ్రాండ్ స్లామ్ ల సంఖ్యను  22కు పెంచుకున్నాడు.  పురుషుల సింగిల్స్ లో తన సమకాలీకుడు  రఫెల్ నాదల్  పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డు (22) ను సమం చేశాడు. 

జకో తన రికార్డును సమం చేయడంపై  తాజాగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జకో ఫోటోను  షేర్  చేస్తూ.. ‘అద్భుతమైన విజయం జకో.. నీకు, నీ టీమ్ కు  శుభాకాంక్షలు. ఇందుకు నువ్వు అర్హుడవు. ఎంజాయ్ ది మూవ్మెంట్...’అని  రాసుకొచ్చాడు. 

గతేడాది  కరోనా టీకా  వేసుకోలేదనే నెపంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం  జకోవిచ్ ను  ఆస్ట్రేలియా ఓపెన్ ఆడేందుకు అనుమతించలేదు. దీంతో అతడు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 2021లో ఈ టోర్నీలో పురుషుల విజేతగా నాదల్ ట్రోపీని ఎగురేసుకుపోయాడు. అది  నాదల్ కెరీర్ లో  21వ గ్రాండ్ స్లామ్.  ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గి వాటిని 22కు పెంచుకున్నాడు.  ప్రస్తుతం జకో.. నాదల్ రికార్డును సమం చేశాడు. మరో గ్రాండ్ స్లామ్ నెగ్గితే అతడే  టాప్ లోకి వస్తాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rafa Nadal (@rafaelnadal)

ప్రస్తుతం నాదల్  కాలి గాయంతో పాటు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అతడు మళ్లీ  టెన్నిస్ కోర్టులో కి అడుగుపెట్టి మునపటి  జోరును చూపడం అనుమానమే. కానీ జకో మాత్రం ఇప్పటికీ కుర్రాళ్లతో పోటీపడుతూ  దూకుడుగా ఆడుతున్నాడు. మరో రెండు మూడేండ్ల వరకూ  జకో టెన్నిస్ ప్రపంచాన్ని  ఏలడం అతిశయోక్తేమీ కాదు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios