అదరగొట్టిన పోలండ్ చిన్నది...19ఏళ్లకే స్వియాటెక్ చేతికి ఫ్రెంచ్ ఓపెన్

 ఎర్రమట్టి కోటలో విజయ పతాకాన్ని ఎగరేసి తన ఖాతాలో మొదటి  గ్రాండ్ స్లామ్ టైటిల్ ను వేసుకుంది స్వియాటెక్. 

Polish teenager Iga Swiatek winFrench Open

పారిస్: పంతోమ్మిదేళ్ల వయసులోనే ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి సంచలనం సృష్టించింది పోలండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్. పోలండ్ కి చెందిన ఈ చిన్నది ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో తిరుగులేని ప్రదర్శనతో టాప్ సీడ్ క్రీడాకారిణిలను సైతం మట్టికరిపించి టైటిల్ విజేతగా నిలిచింది. ఇలా ఎర్రమట్టి కోటలో విజయ పతాకాన్ని ఎగరేసి తన ఖాతాలో మొదటి  గ్రాండ్ స్లామ్ టైటిల్ ను వేసుకుంది స్వియాటెక్. 

Polish teenager Iga Swiatek winFrench Open

ఈ టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్లోకి దూసుకొచ్చిన స్వియాటెక్. శనివారం జరిగిన ఫైనల్లోనూ ఎక్కడా తడబడకుండా అద్భుతంగా ఆడి నాలుగో సీడ్ సోఫీయా కెనిన్(అమెరికా) పై ఘన విజయం సాధించింది. స్వియాటెక్ దాటికి తట్టుకోలేక వరుస సెట్లను కోల్పోయి (6-4, 6-1) కెనిన్ పరాజయం పాలయ్యింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన సోఫియా స్వియాటెక్ ముందు నిలవలేకపోయింది. 

ఫనల్లో స్వియాటెక్ ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ ఆడిన షాట్లు విమర్శలకు ప్రశంసలను కూడా పొందుతున్నాయి. స్వియాటెక్ ఓవైపు చిలరేగిపోతుంటే కెనిన్ కనీస పోటీకి కూడా ఇవ్వలేకపోయింది. ఆమె షాట్లకు కెనిన్ వద్ద సమాధానం లేకపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios