సానియా రిటైర్మెంట్‌పై ప్రధాని మోడీ లేఖ.. చాలామందికి స్ఫూర్తినిచ్చావని ప్రశంసలు

PM Modi-Sania Mirza: భారత  మహిళల  టెన్నిస్ కు కర్త, కర్మ, క్రియగా ఉన్న   హైదరాబాదీ  స్టార్  సానియా మీర్జా  ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

PM Modi Wrote Letter to Sania Mirza on Her Retirement, Tennis Star Reacts MSV

గడిచిన దశాబ్దంన్నర కాలంగా  భారత టెన్నిస్ కు ఎనలేని సేవలు చేసిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది జనవరిలో   ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత  ఆమె     హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన  ఎగ్జిబిషన్ మ్యాచ్ తో  టెన్నిస్ కు శాశ్వతంగా వీడ్కోలు పలికింది.   ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  (డబ్ల్యూపీఎల్) లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ) కు మెంటార్ గా వ్యవహరిస్తున్నది. తాజాగా  భారత టెన్నిస్ కు ఆమె చేసిన సేవలను కొనియాడుతూ ప్రధాని మోడీ  బహిరంగ లేఖ రాశారు.  

లేఖలో మోడీ.. ‘ఇక నుంచి నువ్వు టెన్నిస్ ఆడవన్న విషయం తెలిసినప్పట్నుంచి  టెన్నిస్ అభిమానులు   తాము ఏదో కోల్పోతున్నామని భావిస్తున్నారు.  కెరీర్ లో  నువ్వు ఇండియాలోనే బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగావు.  రాబోయే తరాలలో  ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావు..’అని  పేర్కొన్నారు. 

PM Modi Wrote Letter to Sania Mirza on Her Retirement, Tennis Star Reacts MSV

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత సానియా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు  ఆమె మాట్లాడిన విధానం ఎందరికో  స్ఫూర్తినిచ్చిందని  తద్వారా చాలా మంది హృదయాలు గెలుచుకున్నావని మోదీ ప్రశంసించారు.   సానియాను  ప్రోత్సహించినందుకు గాను మోడీ ఆమె తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.   

 

కాగా ప్రధాని రాసిన లేఖపై   సానియా మీర్జా స్పందించింది.  మోడీ రాసిన లేఖను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..  ‘నేను భారత్ కు  ప్రాతినిథ్యం వహించడాన్ని ఎప్పుడూ గౌరవంగానే భావించా.  ప్రతీసారి నా బెస్ట్ ఇవ్వడానికే యత్నించా.  భవిష్యత్ లో కూడా ఇదే అంకితభావంతో  దేశాన్ని గర్వించేలా చేస్తా.   మీ మద్దతుకు  కృతజ్ఞతలు సార్..’అని  రాసుకొచ్చింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios