Asianet News TeluguAsianet News Telugu

Wimbledon 2022: జబీర్ నవ చరిత్ర.. వింబూల్డన్ ఫైనల్స్ కు ప్రవేశించిన తొలి ఆఫ్రికన్

Ons Jabeur: టెన్నిస్ లో మహిళల ప్రపంచ నెంబర్ 2  క్రీడాకారిణి ఓన్స్ జబీర్ నవ చరిత్ర లిఖించింది. ఆమె  వింబూల్డన్ ఫైనల్స్ కు ప్రవేశించిన తొలి ఆఫ్రికన్ గా నిలిచింది. 
 

Ons Jabeur Making History, Enters Wimbledon 2022 Finals
Author
India, First Published Jul 7, 2022, 11:07 PM IST

యూకే వేదికగా జరుగుతున్న వింబూల్డన్-2022లో ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారిణి,  ట్యూనీషియాకు చెందిన Ons Jabeur సంచలనం సృష్టించింది.  గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి ఆఫ్రికన్ ఉమెన్ గా రికార్డులకెక్కింది. గురువారం 27 ఏండ్ల జబీర్ 6-2, 3-6, 6-1 తేడాతో  జర్మనీ కి చెందిన టట్జాన మరియాను మట్టికరిపించింది. ఫైనల్ లో జబీర్.. 2019 వింబూల్డన్ ఛాంపియన్  సిమోనా హలీప్ లేదా ఎలెనా రిబకనియాలలో ఎవరో ఒకరితో పోటీ పడే అవకాశముంది. 

కాగా ఆఫ్రికన్ దేశాల నుంచి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఒక గ్రాండ్ స్లామ్ పైనల్ లో చేరడం టెన్నిస్ ఓపెన్ ఎరాలో ఇదే తొలిసారి. గతంలో 1927 లో దక్షిణాఫ్రికాకు చెంది బౌడర్ పీకాక్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరింది. 1959 లో అదే దేశానికి చెందిన  రెనీ షూమ్రన్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరింది. 

వీరిద్దరి తర్వాత మహిళల టెన్నిస్ సింగిల్స్  ఫైనల్ కు వెళ్లింది జబీరే. అయితే పైన పేర్కొన్న ఇద్దరూ టెన్నిస్ ఓపెన్ ఎరా (1968) ప్రారంభమయ్యాక ఒక గ్రాండ్ స్లామ్ ఈవెంట్ ఫైనల్ కు చేరింది జబీర్ మాత్రమే. 1969 కు ముందు టెన్నిస్ క్రీడాకారులు ట్రోఫీలు గెలిస్తే ప్రైజ్ మనీలు ఇచ్చేవాళ్లు కాదు. వాళ్లకు ప్రయాణ ఖర్చులు మాత్రమే టోర్నీ నిర్వాహకులు భరించేది. క్రీడాకారులు స్వచ్ఛందంగా గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో పాల్గొనేవారు. కానీ 1969 తర్వాత  ఆటగాళ్లకు టోర్నీలకు ప్రైజ్ మనీ, బహుమతులు అందజేస్తున్నారు. దానినే ఓపెన్ ఎరాగా పిలుస్తారు.  

 

కాగా తాను తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరడంపై జబీర్ మాట్లాడుతూ.. ‘ఇది కలలా ఉంది. నేను చాలా ఏండ్లుగా కంటున్న కల నిజమైంది. ట్యూనిషియా మహిళగా నేను గర్వపడుతున్నా. ఇప్పుడు అక్కడ (ట్యూనీషియా) లో ప్రజలు ఎంత గర్వంగా ఉన్నారో నేను ఊహించగలను. నాకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఫైనల్ లో బాగా ఆడతాను..’ అని తెలిపింది. 

ఇక ఈ మ్యాచ్ లో తనకంటే  మెరుగైన ప్రత్యర్థి టట్జానాను ఓడించడం మానసికంగా ఎంతో స్థైర్యాన్నిచ్చిందని జబీర్ చెప్పింది. ఆమె ఆటను అంత త్వరగా వదిలేసే రకం కాదని.. టట్జానాను ఓడించడానికి తాను కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని జబీర్ వివరించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios