Asianet News TeluguAsianet News Telugu

ఓటమితో కుప్పకూలిన తండ్రి: ఏడవొద్దంటూ హత్తుకున్న కొడుకు

ఆటల్లో గెలుపోటములు సహజం...అయితే ఎంతో కష్టపడి లక్ష్యం దిశగా వచ్చి.. చివర్లో ఓడిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా ఫ్రాన్స్ ఆటగాడు.. గతేడాది డబుల్స్ విజేత నికోలస్ మహుత్ ఈ సారి మూడో రౌండ్‌లోనే టోర్నీ నుంచి వెనుదిరిగాడు

Nicolas Mahut comforted by his son
Author
Paris, First Published Jun 7, 2019, 11:55 AM IST

ఆటల్లో గెలుపోటములు సహజం...అయితే ఎంతో కష్టపడి లక్ష్యం దిశగా వచ్చి.. చివర్లో ఓడిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా ఫ్రాన్స్ ఆటగాడు.. గతేడాది డబుల్స్ విజేత నికోలస్ మహుత్ ఈ సారి మూడో రౌండ్‌లోనే టోర్నీ నుంచి వెనుదిరిగాడు.

గత శుక్రవారం మూడో రౌండ్‌లో అర్జెంటినా ఆటగాడు లియోనార్డ్ మేయర్‌తో తలపడిన 37 ఏళ్ల నికోలస్.. నాలుగు సెట్టు ఓడిపోయి.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాల్సి రావడంతో భావోద్వేగానికి గురయ్యాడు.

బెంచ్‌పై కూర్చొని కన్నీరుపెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నికోలస్ కుటుంబం హాజరైంది. అయితే తండ్రి భావోద్వేగాన్ని చూసిన నికోలస్ ఏడేళ్లే కుమారుడు నతనెల్ గ్యాలరీ నుంచి పరిగెత్తుకుంటూ కోర్టులోకి వచ్చి తండ్రిని ఓదార్చాడు.

ఈ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించింది. చివరికి నికోలస్‌పై విజయం సాధించిన మేయర్ కూడా ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నాడు. నికోలస్ గ్యాలరీ వైపు వెళుతుండగా.. ప్రేక్షకులు సీట్లలోంచి లేచి చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios