ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021 విజేతగా నిలిచింది జపాన్ యంగ్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా. రెండు సెట్ల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన ఒసాకా, అమెరికా ప్లేయర్ జెన్నిఫర్ బ్రాడీని 4-6, 3-6 తేడాతో వరుస సెట్లలో ఓడించింది.

2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఒసాకా, గత ఏడాది యూఎస్ ఓపెన్ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. 23 ఏళ్ల వయసులోనే నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా నిలిచిన ఒసాకా జోరు ముందు బ్రాడీ ఏ మాత్రం నిలువలేకపోయింది.

సెమీ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన ఒసాకి, అదే జోరును ఫైనల్‌లోనూ చూపించింది. ‘నేను దీన్ని సాధించగలనని అనుకున్నాను. గ్రాండ్ స్లామ్ గెలవాలనే ఆలోచనతోనే బరిలో దిగాను, సాధించాను’ అంటూ చెప్పుకొచ్చింది ఒసాకా.