టెన్నిస్ స్టార్, ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ మారియా షరపోవా గురించి తెలియని వారు ఉండరేమో. ఆమె ఆటతోపాటు అందానికి కూడా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాగా.. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇటీవలే ఆమె ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.

బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కేస్‌తో తన నిశ్చితార్ధం జరిగినట్టు గురువారం 33 ఏళ్ల షరపోవా ప్రకటించారు. గిల్కేస్‌ను ఆమె త్వరలో వివాహం చేసుకోనున్నారు. నిశ్చితార్ధంకు సంబందించిన ఫొటోను షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు గిల్కేస్‌ కూడా ఫొటోతో విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

'మేము కలిసిన మొదటి రోజు ఒకే అనుకున్నాం. ఇది ఇప్పటివరకు ఎవరికీ చెప్పబడని రహ్యసం' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. నిశ్చితార్ధం చేసుకున్న మరియా షరపోవాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. టెన్నిస్ ఆటగాళ్లు కూడా షరపోవాకు అభినందనలు తెలుపుతున్నారు.

అలెగ్జాండర్ గిల్కేస్ ఆన్‌లైన్‌లో గృహాలను విక్రయించే పాడిల్8 సంస్థ స్థాపకుడు. ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మరియా షరపోవా,అలెగ్జాండర్ గిల్కేస్ అక్టోబర్ 2018 నుంచి ప్రేమలో ఉన్నారు.