టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం.. మాజీ క్రికెటర్ , హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కుమారుడు అసద్ తో ఇటీవల ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా... రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తన భార్యతో కలిసి వచ్చి సందడి చేశారు.

 ఇక వేడుకల్లో భాగంగా సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌తో రామ్ చరణ్ డ్యాన్స్ వేశాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ నటించిన ‘వార్’ చిత్రంలోని ‘గుంగ్రూ’ అనే పాటకు ఈ ముగ్గురు డ్యాన్స్ వేశారు. ఇక దానికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘దీన్నే డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను అదరగొట్టడం అంటారు’’ అని కామెంట్ పెట్టింది. ఉపాసన పోస్టుకి సానియా కూడా స్పందించింది. ‘నువ్వు మా వీడియో పోస్టు చేశావా’’ అంటూ కామెంట్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

On popular demand !

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on Dec 14, 2019 at 5:34am PST

ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

 

కాగా ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రానికి చరణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.